భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల్లో ఈవీ వాహనాల సంఖ్యను కూడా క్రమేపి పెంచుతున్నాయి. అలాగే కొన్ని స్టార్టప్ కంపెనీలు కూడా ఈవీ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి చెందిన వారు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ప్రముఖ బ్రాండ్ అయిన ఎలెస్కో తన కొత్త స్కూటర్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఇప్పటికే పలు మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న ఎలెస్కో తాజాగా ఎలెస్కో వీ1, వీ2 అనే రెండు మోడల్స్ పరిచయం చేసింది. శక్తివంతమైన బ్యాటరీలతో రూ.69,999కే ఈ స్కూటర్లు వినియోగదారులకు అందుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ స్కూటర్లల్లో వచ్చే అధునాతన ఫీచర్లు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
ఎలెస్కో సూటర్లు ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించామని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్కూటర్లు గరిష్టంగా గంటకు 70 కిలో మీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఈ స్కూటర్ల సొగసైన డిజైన్‌తో పాటు ఎల్‌ఈడీ లైట్లు, డిస్క్ బ్రేక్‌ల వంటి ఫీచర్లతో వస్తుంది. అయితే ఈ స్కూటర్ బ్యాటరీ పవర్, చార్జింగ్ సమయం వంటి వివరాలు కంపెనీ ఇంకా అధికారికంగా పేర్కొనలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..