Electricity Bills: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. వివిధ రకాల బిల్లుల చెల్లింపుల విషయాలలో మరింత సులభతరం అయ్యాయి. అంతా డిజిటల్ చెల్లింపులు అయిపోయాయి. గతంలో లాగా గంటల తరబడి లైన్లలో నిల్చొని బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లోనే ఉండి పనులన్ని చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది. అందుకే డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫామ్లుక ఎంతో ఆదరణ పెరుగుతోంది. గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌పే, భీమ్ వంటి యాప్స్ఈ డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ యాప్‌లు విద్యుత్ బిల్లు చెల్లింపు, డీటీహెచ్రీచార్జ్, మొబైల్ రీచార్జ్, గ్యాస్ బుకింగ్, మెట్రో కార్డ్ రీఛార్జ్‌లతో పాటు అనే సర్వీసులను అందిస్తున్నాయి. మీ నెలవారీ విద్యుత్‌బిల్లును భీమ్, పేటీఎం, ఫోన్‌పే ఉపయోగించి ఎలా పూర్తి చేయాలో తెలుసుకోండి.
భీమ్ యాప్ ద్వారా అయితే ముందుగా మీ ఫోన్లో భీమ్ (BHIM) యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్‌ను యాడ్ చేయండి. దీంతో, కేవలం రెండు నిమిషాల్లోనే మీ విద్యుత్ బిల్లును చెల్లించవచ్చు. యాప్‌లోని స్క్రీన్ మధ్యలో ఉన్న ‘పే బిల్స్’పై క్లిక్ చేయండి. దానిలోని ఎలక్ట్రిసిటీ బిల్ఆప్షన్ను ఎంచుకున్న తర్వాత మీ రాష్ట్ర పరిధిలోని విద్యుత్ డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకోండి. ఇన్‌పుట్ బాక్స్‌లో మీ యూజర్ ఐడీని ఎంటర్చేయండి. దీంతో అక్కడ మీరు చెల్లించాల్సిన బ్యాలెన్స్అమౌంట్చూపిస్తుంది. మీ యూపీఐ పిన్‌తో బిల్ పేమెంట్ పూర్తి చేయండి. వెంటనే మీ బిల్ పేమెంట్పూర్తయినట్లుగా మీ మొబైల్‌కు మెసేజ్వస్తుంది.
గూగుల్ పేలో కూడా బిల్లులు చెల్లించవచ్చు. హోమ్‌స్క్రీన్‌పై కనిపించే ఎలక్ట్రిసిటీ బిల్పేమెంట్పై క్లిక్చేయండి. ఆ తర్వాత మీ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ను ఎంచుకోవాలి. తర్వాత కన్స్యూమర్ నెంబర్ ఎంటర్‌చేసి మీ యూపీఐ ఐడీ ఉపయోగించి బ్యాలెన్స్ అమౌంట్‌ను చెల్లించండి.
ఇక ఫోన్‌పేలో ‘రీఛార్జ్ అండ్బిల్పేమెంట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దానిలో ఎలక్ట్రిసిటీ బిల్ఆప్షన్ను ఎంచుకోండి. ఆ తర్వాత మీ బిల్లర్ పేరును టాప్ సెర్చ్ బార్‌లో ఎంటర్ చేయండి. మీ కన్స్యూమర్ ఐడీని టైప్ చేసి, కన్ఫర్మ్ నొక్కండి. మీరు చెల్లించాల్సిన బ్యాలెన్స్మొత్తం చూపిస్తుంది. ఇలా కూడా బిల్లు చెల్లించవచ్చు.
పేటీఎం యాప్‌ద్వారా కూడా సులభంగా మీ విద్యుత్ బిల్లును చెల్లించవచ్చు. ముందుగా పేటీఎం యాప్‌ని ఓపెన్‌చేసి యాప్ హోమ్‌పేజీలో రీఛార్జ్, బిల్ పేమెంట్ విభాగంలోకి వెళ్లండి. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ అనే ఆప్షన్‌పై క్లిక్‌చేసి మీ రాష్ట్ర పరిధిలోని ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత మీ యూజర్ఐడీని ఎంటర్‌చేసి కంటిన్యూపై నొక్కండి. ఈ విధానం ద్వారా బిల్లు చెల్లించవచ్చు.