Electric Cars: భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!

Electric Cars: ప్రస్తుతం భారత్ NCAP భద్రతా పరీక్షను పూర్తి చేసిన అనేక కార్లు భారతదేశంలో ఉన్నాయి అలాగే ఈ వాహనాలకు భద్రతా రేటింగ్ కూడా లభించింది. భారత్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన అనేక ఎలక్ట్రిక్ కార్లు భారత మార్కెట్లో ఆధిపత్యం..

Electric Cars: భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!

Updated on: Dec 05, 2025 | 4:43 PM

5-Star Safety Rating Electric Cars: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా ఉండటంతో చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. భారతదేశంలో 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన కార్లు ఉన్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ కాలక్రమేణా పెరుగుతోంది. దీని కారణంగా భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఎలక్ట్రిక్ కార్లు ప్రవేశపెడుతున్నాయి. భారతదేశంలో విడుదల అవుతున్న ఈ EVలు అద్భుతమైన ఎలక్ట్రిక్ శ్రేణితో పాటు బలమైన భద్రతా లక్షణాలతో వస్తున్నాయి. ప్రస్తుతం భారత్ NCAP భద్రతా పరీక్షను పూర్తి చేసిన అనేక కార్లు భారతదేశంలో ఉన్నాయి అలాగే ఈ వాహనాలకు భద్రతా రేటింగ్ కూడా లభించింది. భారత్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన అనేక ఎలక్ట్రిక్ కార్లు భారత మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ వాహనాలలో టాటా, మహీంద్రా నుండి శక్తివంతమైన మోడల్‌లు ఉన్నాయి. ఇప్పుడు మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు పేరు కూడా ఈ జాబితాలోకి వచ్చింది.

మారుతి ఈ-విటారా:

మారుతి సుజుకి భారత మార్కెట్ కోసం తమ తొలి ఎలక్ట్రిక్ కారు అయిన ఇ-విటారాను ఆవిష్కరించింది. ఇ-విటారా జనవరి 2026లో లాంచ్ కానుంది. ఇ-విటారా ఇప్పటికే భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సంపాదించింది. ఇ-విటారా వయోజన ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో 32కి 31.49, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP)లో 49కి 43 స్కోర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold, Silver Rates: 2025 ఏడాదిలో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలుసా? మైండ్‌ బ్లాంక్‌ అయ్యే వివరాలు!

5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో టాటా EVలు:

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లలో అనేకం ఇండియా NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. వీటిలో పంచ్ EV, హారియర్ EV, నెక్సాన్ EV, కర్వ్ EV ఉన్నాయి.

  • టాటా హారియర్ EV పెద్దలకు ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో 32కి 32, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP)లో 49కి 45 స్కోర్ సాధించింది.
  • Tata Punch EV పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో 32కి 31.46 స్కోర్‌ను సాధించగా, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP)లో 49కి 45 స్కోర్‌ను సాధించింది.
  • టాటా నెక్సాన్ EV ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో 32కి 29.86, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP)లో 49కి 44.95 స్కోర్ సాధించింది.
  • టాటా కర్వ్ EV పెద్దల విషయంలో ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో 32కి 30.81, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP)లో 49కి 44.83 స్కోర్ సాధించింది.

మహీంద్రా EV కూడా 5-స్టార్ రేటింగ్‌:

భారత మార్కెట్లో టాటా మోటార్స్ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను కలిగి ఉన్న సంస్థ మహీంద్రా. మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లలో ప్రయాణికుల భద్రతపై కూడా బలమైన దృష్టి పెట్టింది. మహీంద్రా EVలు భారత్ NCAP క్రాష్ పరీక్షలలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. ఈ వాహనాలలో మహీంద్రా XUV 400 EV, XEV 9e, BE 6 ఉన్నాయి.

  • మహీంద్రా XUV 400 EV అడల్ట్‌ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో 32కి 30.38 స్కోర్‌ను సాధించగా, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP)లో 49కి 43 స్కోర్‌ను సాధించింది.
  • మహీంద్రా XEV 9e ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో 32కి 32 స్కోర్‌లను, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP)లో 49కి 45 స్కోర్‌లను సాధించింది.
  • మహీంద్రా BE 6 ప్రొటెక్షన్‌ (AOP)లో 32కి 31.97 స్కోర్‌ను సాధించగా, పిల్లల ప్రొటెక్షన్‌ (COP)లో 49కి 45 స్కోర్‌ను సాధించింది.

ఇది కూడా చదవండి: Post Office: పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. రూ.15 వేల డిపాజిట్‌తో చేతికి రూ.25 లక్షలు!

ఇది కూడా చదవండి: Auto News: బెస్ట్‌ స్కూటర్‌.. దీనిలో ఫుల్‌ ట్యాంక్ చేస్తే రూ. 238 కి.మీ మైలేజీ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి