“రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ” గట్టెక్కించదు.. మూడీస్ సంచలన వ్యాఖ్యలు

అంతర్జాతీయ రేటింగ్ సంస్థ.. మూడీస్ ఇన్వెస్టర్స్ ఈ ప్యాకేజీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ  గట్టెక్కించదు.. మూడీస్ సంచలన వ్యాఖ్యలు

Updated on: May 19, 2020 | 3:50 PM

కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీపై ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పెదవి విరిచారు. అదేం ప్యాకేజీ అంటూ విమర్శలు గుప్పించారు. కేంద్ర సంస్కరణలు అమలు చేస్తే రుణం ఇస్తామనడం ప్యాకేజి అవుతుందా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని, ఆర్థికంగా దిగజారిన వేళ రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెంచుతూ ఆంక్షలు విధించడం నియంతృత్వమేనని విమర్శించారు. ఇదిలా ఉంటే..తాజాగా అంతర్జాతీయ రేటింగ్ సంస్థ.. మూడీస్ ఇన్వెస్టర్స్ ఈ ప్యాకేజీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ కరోనా నుంచి బయటపడేందుకు తోడ్పడదని చెప్పింది. ఆర్థిక సంస్థల సంపద కరిగిపోకుండా కాపాడగలదు కానీ, కరోనా సంక్షోభం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఉపయోగపడదని మూడీస్ తెలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us