Business Ideas: స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు.. ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా నెలకు రూ.50 వేలు సంపాదించవచ్చు! మహిళలకు బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా

స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియాను ఉపయోగించి ఇంటి వద్ద నుండే నెలకు రూ.50,000 వరకు సంపాదించవచ్చు. ముఖ్యంగా మహిళలకు ఇది చక్కటి అవకాశం. ఉదాహరణకు, టైలరింగ్ నైపుణ్యాలను యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, ఆన్‌లైన్ క్లాసులు చెబుతూ ప్రకటనలు, బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా ఆదాయం పొందవచ్చు.

Business Ideas: స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు.. ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా నెలకు రూ.50 వేలు సంపాదించవచ్చు! మహిళలకు బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా
Women With Money

Updated on: Nov 11, 2025 | 7:45 AM

ఈ కాలంలో ఫోన్‌ లేని వారు ఎవరున్నారు చెప్పండి. దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. కానీ, చాలా మంది ఆ ఫోన్లో రీల్స్‌ చూస్తూ టైమ్‌ పాస్‌ చేస్తుంటారు. కానీ, సరిగ్గా ఆ స్మార్ట్‌ ఫోన్‌ను వాడుకుంటే మాత్రం. ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు అయితే ఇది మంచిగా వర్క్‌ అవుట్‌ అయ్యే బిజినెస్‌ అవుతుంది. ఇంతకీ ఆ బిజినెస్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

సోషల్ మీడియాను ఉపయోగించుకొని చక్కటి ఆదాయం పొందే అవకాశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్లర్ గా మారి మంచి ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా మహిళలు ఇంటి వద్ద ఉంటూనే తమకు నచ్చిన రంగంలో తమ ప్రావీణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆదాయం పొందవచ్చు. ఉదాహరణకు మహిళలు మీరు మంచి లేడీస్ టైలర్ అయినట్లయితే, మీ టైలరింగ్ స్కిల్స్ స్మార్ట్ ఫోన్ కెమరా ద్వారా రికార్డు చేసి ఇప్పుడు ఆ వీడియోలను యూట్యూబ్ ఛానల్, లేదా ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు.

ఆన్లైన్ ద్వారా టైలరింగ్ క్లాసెస్ చెప్పడం ద్వారా యూట్యూబ్ లో చక్కటి వ్యూస్ పొందే అవకాశం ఉంటుంది. తద్వారా మీకు మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది. యూట్యూబ్ మానిటైజేషన్ జరగాలి అనుకున్నట్లయితే 1,000 మంది సబ్ స్క్రైబర్లు, 4000 వాచింగ్ గంటలు అవసరం అవుతాయి. అనంతరం మీ యూట్యూబ్ ఛానల్ కు మానిటైజేషన్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత మీ వీడియోలపై యాడ్స్ రన్ అవ్వడం ద్వారా చక్కటి ఆదాయం ప్రతినెల డబ్బులు వస్తాయి. అలాగే ఇతర బ్రాండ్‌లను ప్రమోట్‌ చేయడం వల్ల కూడా ఆదాయం పొందవచ్చు. టైలరింగ్‌కు సంబంధించి.. కుట్టు మిషన్‌ కంపెనీలు, దారం కంపెనీలు, కొత్త డిజైన్‌లు అందించే బట్టల కంపెనీలు వారి బ్రాండ్ ప్రమోషన్‌ కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చు. అందుకోసం భారీగా డబ్బులు ఇస్తారు. ఇలా స్మార్ట్‌ ఫోన్‌ను సరిగ్గా వాడి.. మంచి ఆదాయం పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి