ఆన్‏లైన్ షాపింగ్ వస్తువులు ఫేక్ అని తేలితే కంపెనీదే బాధ్యత.. కొత్త పాలసీని తీసుకువచ్చిన కేంద్రం…

| Edited By: Ram Naramaneni

Mar 14, 2021 | 1:02 PM

ప్రస్తుతం చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కరోనా ప్రభావంతో ఈ ఆన్ లైన్ షాపింగ్ చేసేవారి

ఆన్‏లైన్ షాపింగ్ వస్తువులు ఫేక్ అని తేలితే కంపెనీదే బాధ్యత.. కొత్త పాలసీని తీసుకువచ్చిన కేంద్రం...
E Commerce Companies
Follow us on

ప్రస్తుతం చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కరోనా ప్రభావంతో ఈ ఆన్ లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నిత్యవసర సరుకుల నుంచి బట్టలు, చెప్పులు, స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా అన్ని ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇప్పటికీ వీటిపై చాలా మందికి అనేక సందేహాలు కూడా ఉన్నాయి. ఆర్డర్ చేసాక.. ఫేక్ వస్తువు వస్తే ఏం చేయ్యాలి ?, నిజాంగానే ఆ వస్తువులు సరైనదేనా ? అనే సందేహాలు చాలా మందిలో ఉంటున్నాయి. ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం కొత్త నిబంధనలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించిన నియమాలను నేషనల్ ఈ కామర్స్ పాలసీ ముసాయిదాలో పొందుపరిచింది. ప్రైవేట్, ప్రైవేట్‏యేతర డాటాపై ప్రభుత్వం ముసాయిదా ప్రక్రియలా పాలసీని పేర్కోంది.

పరిశ్రమ అభివృధ్దికి డాటా వినియోగ విధానం నిర్ణయించనుంది. అంతేకాకుండా పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ (డీపీఐఐటీ) సీనియర్ అధికారి అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఈ ముసాయిదాపై చర్చించారు.

వస్తువు ఉత్పత్తుల సమాచారాన్ని వినియోగదారులకు అందేలా..

ప్రతి ఉత్పత్తులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వినియోగదారులకు అందేలా ముసాయిదా తీసుకురానున్నట్లు తెలిపారు. అలాగే వారికి సంబంధిత ఉత్పత్తి యొక్క మూలం గురించి పూర్తి సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈకామర్స్ కంపెనీలు తమ ఫ్లాట్ ఫాంలలో నమోదు చేసుకున్న అమ్మకందారులందరితో సమానంగా వ్యవహరించాలని పేర్కొంది.

నకిలీ ఉత్పత్తి ఈ-కామర్స్ సంస్థదే బాధ్యత..

ఈ కామర్స్ కంపెనీలు తమ ఫాట్ ఫాంలలో విక్రయించే ఉత్పత్తులు నకిలీవి కాదని ముందే నిర్ధారించుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకోసం సేఫ్ గార్డ్ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏదైనా ఈ కామర్స్ సంస్థ నుంచి నకిలీ ఉత్పత్తిని అమ్మితే అది అన్ లైన్ కంపెనీతోపాటు, అమ్మంకందారుల బాధ్యత అవుతుందని తెలిపింది. ఇది పారిశ్రామిక అభివృద్ధికి డేటా షేరింగ్ ప్రొత్సహించబడుతుందని తెలిపింది. ఇందుకోసం మరిన్ని డేటా నిబంధనలు రానున్నట్లుగా తెలిపింది.

ప్రభుత్వ చర్యలు..

ఆన్ లైన్ షాపింగ్ ఫ్లాట్ ఫాం నుంచి చాలా కాలంగా నకిలీ ఉత్పత్తులను విక్రయించినట్లుగా ఫిర్యాదులు ఉన్నాయని అధికారులు తెలిపారు. దీనివలన చాలా మంది వినియోగదారులు భారీ నష్టాలను భరించాల్సి వస్తుందని.. అందుకోసమే ఈ కామర్స్ లోని లోపాలను సరిదిద్దడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే మరికొన్ని రోజులలో ఈ మార్కెట్లలో షాపింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడమే కాకుండా.. నమ్మకమైన ఉత్పత్తులు అందించేందుకు కృషి చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు.

Also Read:

AP Municipal Election Results 2021 LIVE: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా

ఎగురుతూ వచ్చి బొక్కబోర్ల పడ్డ పక్షి.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న వీడియో.. ఎలాగో మీరు చూడండి..