Online Sales: సేల్స్ సమయంలో మీ జేబుకు చిల్లు పడుతుందా..? కొనుగోళ్ల సమయంలో ఈ టిప్స్ మస్ట్

|

Jul 20, 2024 | 4:15 PM

ప్రస్తుత రోజుల్లో భారతదేశంలో షాపింగ్ కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా ప్రజలు ఇటీవల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టపడుతున్నారు. మొదట్లో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఆన్‌లైన్ షాపింగ్ డెలివరీ సదుపాయాలు పెరగడంతో గ్రామీణ ప్రాంతాలకు చేరాయి. ముఖ్యంగా ప్రజలు ఎలాంటి వస్తువు కొనాలన్నా ముందుగా వాటి ధరను ఈ-కామర్స్ సైట్స్‌లో చెక్ చేస్తున్నారంటే ఆన్‌లైన్ షాపింగ్ వృద్ధిని మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి.

Online Sales: సేల్స్ సమయంలో మీ జేబుకు చిల్లు పడుతుందా..? కొనుగోళ్ల సమయంలో ఈ టిప్స్ మస్ట్
Shopping
Follow us on

ప్రస్తుత రోజుల్లో భారతదేశంలో షాపింగ్ కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా ప్రజలు ఇటీవల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టపడుతున్నారు. మొదట్లో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఆన్‌లైన్ షాపింగ్ డెలివరీ సదుపాయాలు పెరగడంతో గ్రామీణ ప్రాంతాలకు చేరాయి. ముఖ్యంగా ప్రజలు ఎలాంటి వస్తువు కొనాలన్నా ముందుగా వాటి ధరను ఈ-కామర్స్ సైట్స్‌లో చెక్ చేస్తున్నారంటే ఆన్‌లైన్ షాపింగ్ వృద్ధిని మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఇంచుమించు ప్రతి నెలా ఓ సేల్ నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సేల్స్ సమయంలో అనవసర ఆఫర్స్ వల్ల జేబు గుల్ల చేసుకుంటున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్‌లో గోట్ సేల్, అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సేల్ సమయంలో జేబుకు చిల్లు పడకుండా షాపింగ్ ఎలా చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.

జాబితా చేసుకోవడం

సేల్‌లో మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఉత్పత్తుల జాబితాను రూపొందించుకోవాలి. ఇది మీకు అవసరమైన వస్తువులపై మాత్రమే దృష్టి పెట్టడంలో మీకు సహాయపడుతుంది. అలాగే ఆన్-సైట్‌లో అందించే వివిధ రకాల డిస్కౌంట్‌ల వైపు మనస్సు మళ్లకుండా ఉంటుంది. మీరు ఇంట్లో అవసరమైన వాటిని రీస్టాక్ చేయడానికి లేదా గాడ్జెట్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు మీ ఆలోచనలకు తగ్గకుండా ముందుగానే జాబితా చేసుకోవడం ఉత్తమం.

ధరలను సరిపోల్చడం

సేల్స్ సమయంలో పెట్టిన ధర చాలా వరకు తక్కువగానే ఉంటుంది. అయితే పోటీ యాప్స్‌లో కూడా వాటి ధరలు ఎలా ఉన్నాయో? కొనుగోలు చేసే ముందు సరిపోల్చడం ఉత్తమం. కొన్నిసార్లు గణనీయమైన తగ్గింపు అనేది ఉత్తమ ఆఫర్ కాకపోవచ్చని, అందువల్ల కొనుగోలు చేసే ధరలను సరిపోల్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

బడ్జెట్‌

సేల్ సమయంలో మీరు కొనుగోలు చేయాలనుకునే వస్తువులకు ముందుగానే బడ్జెట్‌ను సెట్ చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల అధిక ఖర్చు నుంచి దూరంగా ఉండవచ్చు. మీకు కావాల్సిన వస్తువులు మీ బడ్జెట్‌లోనే జాబితా చేయడం వల్ల మీరు అధికంగా ఖర్చు పెట్టకుండా ఉంటారు. 

అదనపు కూపన్లు

ముందుగా అందించే డిస్కౌంట్‌కు మించి బ్యాంక్ కార్డ్‌లపై అదనపు ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. మీరు కనీస కొనుగోలు మొత్తాన్ని చేరుకున్న తర్వాత అనేక కూపన్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. చెక్ అవుట్ చేస్తున్నప్పుడు వీటిని వర్తింపజేయడం వల్ల మీరు అదనంగా ఆదా చేసుకోవచ్చు.

లైట్‌నింగ్ డీల్స్

అన్ని షాపింగ్ యాప్స్‌లో లైట్నింగ్ డీల్స్ అందిస్తూ ఉంటాయి. ఇవి లిమిటెడ్ టైమ్ డీల్స్‌గా ఉంటాయి. అందువల్ల మీరు కొనుగోళ్లల్లో పొదుపు చేయాలనేకుంటే ఈ లైట్నింగ్ డీల్స్ సమయంలో కొనుగోలు చేస్తే అధికంగా ఆదా చేయవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి