New EV Scooter: భారీ మైలేజ్‌ను ఇచ్చే ఈ స్కూటర్ గురించి తెలుసా? తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు..

తాజాగా ఓ కంపెనీ నాలుగు గంటల చార్జింగ్‌తో 120 కిలో మీటర్ల మైలేజ్ ఇచ్చే సరికొత్త ఈవీ స్కూటర్‌ను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా విమర్శకుల ప్రశంసలను అందుకున్న ప్యూర్ ఈవీ ఈ ట్రాన్స్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇతర విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

New EV Scooter: భారీ మైలేజ్‌ను ఇచ్చే ఈ స్కూటర్ గురించి తెలుసా? తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు..
Pure Ev Trance Ev

Updated on: May 02, 2023 | 7:30 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇష్టపడడంతో కంపెనీలు కూడా కొత్త కొత్త మోడల్స్‌ను ఇబ్బడిముబ్బడిగా మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఇన్ని వెరైటీ స్కూటర్లల్లో ఏ స్కూటర్‌ను ఎంచుకోవాలో? తెలియక సగటు వినియోగదారుడు ఇబ్బందిపడుతున్నాడు. అయితే తాజాగా ఓ కంపెనీ నాలుగు గంటల చార్జింగ్‌తో 120 కిలో మీటర్ల మైలేజ్ ఇచ్చే సరికొత్త ఈవీ స్కూటర్‌ను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా విమర్శకుల ప్రశంసలను అందుకున్న ప్యూర్ ఈవీ ఈ ట్రాన్స్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇతర విషయాలను ఓ సారి తెలుసుకుందాం. ఢిల్లీలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్-రోడ్ ధర రూ. 85,928గా ఉంది. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 81,999 అని కంపెనీ ప్రకటించింది. బీమా ఖర్చులు రూ. 3,929గా. ఇతర నగరాలు లేదా రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధర కొద్దిగా మారవచ్చు. అయితే ఈ వ్యత్యాసం భారీగా ఉండదు. అయితే స్కూటర్ ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే ఆరు విభిన్న రంగులలో వస్తుంది. ఈ స్కూటర్ ఫీచర్ల గురించి ఓ లుక్కేద్దాం.

ప్యూర్ ఈవీ ఈ ట్రాన్స్ నియో ఫీచర్లు ఇవే

ప్యూర్ ఈవీ ఈ ట్రాన్స్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 కేడబ్ల్యూ బ్యాటరీ, బీఎల్‌డీసీ మోటార్‌తో వస్తుంది. ముందు భాగంలో ఎల్‌ఈడీ లైటింగ్‌తో పాటు డిస్క్ బ్రేక్‌లు, అలాగే వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. స్కూటర్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి రైడర్‌కు ఇండికేషన్ ఇవ్వడానికి హ్యాండిల్‌బార్‌లపై లో బ్యాటరీ అలర్ట్ వెలుగుతుంది. ఇది గరిష్టంగా 150 కిలోగ్రాముల మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. అలాగే ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. లిథియం-అయాన్ బ్యాటరీ 2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ స్స్కూటర్‌ను దాదాపు నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ రోజువారీ ప్రయాణానికి అనువైనదిగా ఉంటుంది. 

ప్యూర్ ఈవీ ఈ ట్రాన్స్ నియోపై వినియోగదారుల అభిప్రాయాలు

ఈ స్కూటర్ సగటు మధ్యతరగతి వినియోగదారుడికి చాలా బాగా ఆకట్టుకుంది. ఈ స్కూటర్‌ను సంవత్సరం పాటు ఉపయోగించిన వినియోగదారులు ఈ స్కూటర్ గురించి మంచి రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ స్కూటర్ హెడ్‌లైట్ ఆరిపోతోందని సాధారణ ఫిర్యాదుగా ఉంది. అలాగే చవకైన రవాణా విషయానికి వస్తే ఈ స్కూటర్ ఆధారపడవచ్చని వారు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..