నిశాంత్ తన క్రెడిట్ కార్డ్ లిమిట్ అంతా వాడేశాడు. నెల ముగుస్తోంది. అతని జీతం కూడా అంతే. కానీ అతను ఇంకా కొన్ని బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి, అతను బ్యాంక్ యాప్‌లో తన క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ని చెక్ చేస్తున్నాడు. అతను తన క్రెడిట్ కార్డ్‌పై ఓవర్ లిమిట్ సదుపాయానికి అర్హుడని చూసాడు. ఓవర్‌లిమిట్ అంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పూర్తి చేసినట్లయితే, మీరు ఇంకా కొంత మొత్తాన్ని దాని కంటే ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. నిశాంత్‌కు డబ్బు అవసరం చాలా ఉన్నందున ఈ సదుపాయంతో ముడిపడిఉన్న నిబంధనలు, ఛార్జీల గురించి అతను అర్థం చేసుకోకుండా లేదా చదవకుండా వెంటనే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాడు. నిశాంత్ తప్పు చేశాడా, లేదా ఓవర్‌లిమిట్ సౌకర్యాన్ని ఉపయోగించడం సరైనదేనా? దానికి సమాధానం ఇవ్వడానికి, క్రెడిట్ కార్డ్ ఓవర్‌లిమిట్ గురించి మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి.
క్రెడిట్ కార్డ్ పరిమితి మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి మీరు ఖర్చు చేయగల గరిష్ట మొత్తాన్ని నిర్ణయిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే మీరు ఖర్చు చేయగల పరిమితిని ఇది మీకు చెబుతుంది. ఈ లిమిట్ ను మీ ఆదాయం ఆధారంగా నిర్ణయిస్తారు. కానీ చాలా సార్లు మీరు ఈ లిమిట్ కంటే ఎక్కువ ఖర్చు చేయవచ్చు. మీ క్రెడిట్ కార్డ్‌లో మీరు పొందే ఓవర్‌లిమిట్ సౌకర్యం ద్వారా ఇలా చేయవచ్చు. క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసే అనేక బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఓవర్‌లిమిట్ సదుపాయాన్ని అందించడం ప్రారంభించాయి. ఇది వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ పరిమితికి మించి ఖర్చు చేయడంలో సహాయపడుతుంది. అత్యవసర పరిస్థితులు లేదా ఇబ్బందుల సమయంలో ఇది మంచి బఫర్‌గా కూడా పనిచేస్తుంది.
దీన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. మీ క్రెడిట్ కార్డ్ పరిమితి రూ.1.5 లక్షలు అని అనుకుందాం. సాధారణంగా మీరు మీ ఖర్చులను రూ. 1.5 లక్షల కంటే తక్కువగానే చేస్తారు. కానీ బ్యాంక్ ఓవర్ లిమిట్ సదుపాయంతో మీరు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ను దీనికి మించి పొడిగించవచ్చు. ఈ ఓవర్‌లిమిట్ మీ క్రెడిట్ కార్డ్ పరిమితిలో 10-20% వరకు ఉండవచ్చు. అందుకే మీ క్రెడిట్ కార్డ్‌పై రూ.1.5 లక్షల పరిమితితో 20% ఓవర్‌లిమిట్ సదుపాయం ఉన్నట్లయితే, మీరు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.1 లక్షా 80 వేలు లేదా రూ. 30,000 ఎక్కువుగా ఖర్చు చేయవచ్చు.
బ్యాంకులు సాధారణంగా ఓవర్‌లిమిట్ మొత్తంపై 2.5 నుండి 5% మధ్య ఛార్జీలు విధిస్తాయి.ఈ ఛార్జీ.. కార్డ్, క్రెడిట్ చరిత్ర లేదా కార్డ్ జారీ చేసే పాలసీలను బట్టి మారవచ్చు. ఈ సదుపాయాన్ని పొందడానికి మీరు మీ బ్యాంక్‌కి ముందస్తు సమ్మతి ఇవ్వాలి. చాలా సార్లు, బ్యాంకులు తమ సేవలను మెరుగుపరిచే ప్రయత్నంలో మీకు ఈ సౌకర్యాన్ని అందించవచ్చు అయితే, మీ క్రెడిట్ స్కోర్ సగటు కంటే తక్కువగా ఉంటే లేదా మీ చెల్లింపు చరిత్ర బాగాలేకపోతే.. మీకు ఈ సదుపాయాన్ని అందించడానికి బ్యాంక్ నిరాకరించవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించడం మంచిది. ఓవర్‌లిమిట్ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నప్పుడు వినియోగదారులు దీన్ని గుర్తుంచుకోవాలని, దానిపై ఎక్కువగా ఆధారపడకూడదని బ్యాంకులు భావిస్తాయి. ఓవర్‌లిమిట్ సదుపాయాన్ని చాలా తరచుగా ఉపయోగించడం మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.
ఈ సదుపాయం చాలా అత్యవసరంగా నిధుల అవసరం ఉన్న వినియోగదారుల కోసం ఉద్దేశించింది. కానీ ఈ సదుపాయాన్ని తెలివిగా ఉపయోగించడం ముఖ్యం. లేకపోతే మీకు అనవసరంగా ఛార్జీలు పడతాయి. అందుకే ఓవర్‌లిమిట్ సౌకర్యంతో లింక్ అయిన షరతులు, ఫీజులను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి