
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, విద్యుత్ బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు లేదా SIPల వంటి చెల్లింపులు ప్రతి నెలా మీ బ్యాంక్ ఖాతా నుండి ఆటో-డెబిట్ ద్వారా కట్ అవుతుంటే ఈ వార్త మీకు ముఖ్యమైనది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇ-పేమెంట్‌లు లేదా పునరావృత చెల్లింపు వ్యవస్థలకు సంబంధించిన నిబంధనలను మార్చింది. ఇప్పుడు రూ.15,000 దాటిన ఆటో-పేమెంట్‌లకు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA) అనే అదనపు భద్రతా పొర తప్పనిసరి అవుతుంది.
కొత్త నిబంధనల ప్రకారం రూ.15,000 వరకు పునరావృత చెల్లింపులు ఓటీపీ లేకుండానే కట్ అవుతాయి. అయితే రూ.15,000 పైబడిన చెల్లింపులకు అదనపు ధృవీకరణ అవసరం అవుతుంది. దీనివల్ల చిన్న చెల్లింపులు సులభతరం అవుతాయి. పెద్ద చెల్లింపులు మరింత సురక్షితం అవుతాయి. దీనివల్ల సాధారణ లావాదేవీలతో పాటు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి.
ఇది కూడా చదవండి: Gold Price Today: అదే ధరతో ఊగిసలాడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
రూ. 15,000 వరకు సులభంగా: ప్రతి లావాదేవీకి 15,000 రూపాయల వరకు చేసే చెల్లింపులకు ఇకపై అదనపు ధృవీకరణ (Additional Factor of Authentication – AFA) లేదా OTP అవసరం లేదు.
ఇన్సూరెన్స్ ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్లు, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపుల కోసం ఈ పరిమితిని ఏకంగా రూ. 1 లక్ష వరకు పెంచారు. అంటే లక్ష రూపాయల వరకు ఈ కేటగిరీల్లో ఎటువంటి అదనపు అథెంటికేషన్ లేకుండానే ఆటోమేటిక్ డెబిట్ జరుగుతుంది.
ఈ-మ్యాండేట్ నమోదు చేసేటప్పుడే దాని కాలపరిమితిని స్పష్టంగా పేర్కొనాలి. వినియోగదారులు తమకు నచ్చిన సమయంలో ఈ మ్యాండేట్‌ను మార్చుకోవచ్చు లేదా పూర్తిగా రద్దు చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
వ్యూయబుల్ (Variable) అమౌంట్ చెల్లింపుల కోసం వినియోగదారులు ఒక గరిష్ట పరిమితిని (Maximum Limit) సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ డబ్బు కట్ అయ్యే అవకాశం ఉండదు.
మీ ఖాతా నుండి డబ్బు కట్ అవ్వడానికి కనీసం 24 గంటల ముందే బ్యాంకులు మీకు నోటిఫికేషన్ పంపాలి. ఇందులో మర్చంట్ పేరు, మొత్తం, డెబిట్ అయ్యే సమయం వంటి వివరాలు ఉంటాయి. దీనివల్ల మీకు ఇష్టం లేని లావాదేవీని ఆపే అవకాశం ఉంటుంది.
తొలి లావాదేవీకి తప్పనిసరి: ఏదైనా కొత్త ఈ-మ్యాండేట్ నమోదు చేసినప్పుడు మొదటిసారి లావాదేవీకి మాత్రం ఖచ్చితంగా OTP/AFA ధృవీకరణ అవసరం.
FASTag, NCMC: ఫాస్టాగ్ (FASTag), నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) లలో ఆటోమేటిక్ బ్యాలెన్స్ నింపుకోవడానికి (Top-up) ఎటువంటి ముందస్తు అలర్ట్స్ అవసరం లేదని RBI స్పష్టం చేసింది.
ఈ-మ్యాండేట్ సౌకర్యాన్ని పొందేందుకు కస్టమర్ల నుండి బ్యాంకులు ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు. పాత కార్డు స్థానంలో కొత్త కార్డ్ వచ్చినప్పుడు, పాత ఈ-మ్యాండేట్లను కొత్త కార్డుకు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది.
అనధికారిక లావాదేవీల నుండి రక్షణ కల్పిస్తూనే, వినియోగదారుల సమయాన్ని ఆదా చేసేలా RBI ఈ నిర్ణయం తీసుకుంది. బలమైన వివాద పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని బ్యాంకులను ఆదేశించింది. దీనివల్ల సామాన్యులకు డిజిటల్ చెల్లింపుల పట్ల మరింత నమ్మకం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: Gas Cylinder: ఓన్లీ ఆధార్ ఉంటే చాలు.. 5 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్.. బుకింగ్ అవసరమే లేదు!
ఇది కూడా చదవండి: Silver Price Crash: వెండి ధరల్లో పెను పతనం? కిలో వెండి లక్షకు చేరుతుందా? మార్కెట్‌లో ప్రకంపనలు.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి