Indian Railways: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? పరిమితికి మించితే భారీ జరిమానా!

|

Mar 30, 2024 | 7:29 PM

ఆసియాలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లో భారతీయ రైల్వే ఒకటి. దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజలకు సుదూర ప్రయాణానికి రైళ్లు మాత్రమే మార్గం. రోజూ రైలులో ప్రయాణిస్తున్నప్పటికీ, చాలా మందికి రైలు నియమాల గురించి తెలియదు. అలాగే రైళ్లలో లగేజీని తీసుకెళ్లేందుకు కూడా నిర్దిష్ట పరిమితి ఉంటుంది. విమాన ప్రయాణంలో సామాను పరిమితి ఉన్నట్లే, కొంత బరువున్న సామాను మాత్రమే తీసుకెళ్లవచ్చు. రైలులో కూడా అదే వర్తిస్తుంది.

Indian Railways: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? పరిమితికి మించితే భారీ జరిమానా!
Indian Railways
Follow us on

ఆసియాలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లో భారతీయ రైల్వే ఒకటి. దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజలకు సుదూర ప్రయాణానికి రైళ్లు మాత్రమే మార్గం. రోజూ రైలులో ప్రయాణిస్తున్నప్పటికీ, చాలా మందికి రైలు నియమాల గురించి తెలియదు. అలాగే రైళ్లలో లగేజీని తీసుకెళ్లేందుకు కూడా నిర్దిష్ట పరిమితి ఉంటుంది. విమాన ప్రయాణంలో సామాను పరిమితి ఉన్నట్లే, కొంత బరువున్న సామాను మాత్రమే తీసుకెళ్లవచ్చు. రైలులో కూడా అదే వర్తిస్తుంది. మీరు నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ బ్యాగేజీని తీసుకెళ్లాలనుకుంటే మీరు అదనపు డబ్బు చెల్లించాలి. మరి ఈ రూల్ తెలియక పట్టుబడితే సాధారణ రేటు కంటే 6 రెట్లు అధికంగా జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.

రైలులో ఉచితంగా ఎన్ని కిలోల సరుకులు తీసుకెళ్లవచ్చు?

విమానాల మాదిరిగానే రైళ్లు కూడా కొంత బరువున్న లగేజీని తీసుకెళ్లవచ్చు. దీనికి ఎటువంటి అదనపు రుసుము ఉండదు. వివిధ తరగతుల రైళ్లకు బ్యాగేజీ రుసుము కూడా భిన్నంగా ఉంటుంది. మీరు AC ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నట్లయితే, బ్యాగేజీ 70 కిలోల వరకు ఉంటుంది. దీనికి ఎలాంటి అదనపు రుసుము లేదు. ఏసీ 2-టైర్ కోసం బ్యాగేజీ పరిమితి 50 కిలోలు. AC 3-టైర్ స్లీపర్, AC చైర్ కార్, స్లీపర్ క్లాస్ విషయంలో 40 కిలోల వరకు బ్యాగేజీని తీసుకెళ్లవచ్చు. 2వ తరగతి ప్రయాణికులు గరిష్టంగా 25 కిలోల సామాను తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ బరువున్న వస్తువులను తీసుకెళ్లినట్లయితే బ్యాగేజీ రుసుము కనిష్టంగా రూ.30 విధిస్తారు. కానీ ఆ రుసుముతో కూడా మీరు కోరుకున్నంత లగేజీతో రైలు ఎక్కలేరు. మీరు AC ఫస్ట్ క్లాస్ టిక్కెట్‌ను కలిగి ఉంటే, మీరు బ్యాగేజీ రుసుముతో గరిష్టంగా 150 కిలోల వరకు బ్యాగేజీని తీసుకెళ్లవచ్చు. AC 2 టైర్ స్లీపర్ లేదా ఫస్ట్ క్లాస్ విషయంలో మీరు అదనపు బ్యాగేజీ రుసుముతో గరిష్టంగా 100 కిలోల లగేజీని తీసుకెళ్లవచ్చు. AC 3-టైర్ స్లీపర్ లేదా AC చైర్ కార్‌లో మీరు బ్యాగేజీ రుసుముతో గరిష్టంగా 40 కిలోల లగేజీ తీసుకెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్ ప్రయాణికులు గరిష్టంగా 80 కిలోలు, సెకండ్ క్లాస్ ప్రయాణికులు గరిష్టంగా 70 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.

జరిమానా ఎంత?

మీరు నిర్దేశిత బరువు పరిమితిని మించిన బ్యాగేజీతో రైలులో ఎక్కి, దానికి అదనపు రుసుమును బుక్ చేయకపోతే అప్పుడు ప్రయాణీకుడికి రైల్వే జరిమానా విధించబడుతుంది. రైల్వే నిబంధనల ప్రకారం.. ఒక ప్రయాణికుడు రైలులో అధిక బరువుతో లగేజీని బుక్ చేసుకోకుండా లేదా అదనపు రుసుము చెల్లించకుండా తీసుకువెళితే, నిర్దేశిత పరిమితికి మించిన బరువు ఆధారంగా అతను 6 రెట్లు జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి