
December 2025 Bank Holidays: ప్రతి రోజు బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లేవారు చాలా మంది ఉంటారు. అయితే ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది రిజర్వ్ బ్యాంకు. ప్రతి రోజు బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు జరిపే వారు నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వచ్చే నెల డిసెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులకు మొత్తం 18 బ్యాంకు సెలవులు ఉన్నాయి. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. ఈ డిసెంబర్‌లో క్రిస్మస్‌కు సాధారణ సెలవు ఉంటుంది. ఇతర రోజులలో వివిధ ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోండి. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి.
సెలవు దినాల్లో బ్యాంకు కార్యాలయాలు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ అందుబాటులో ఉంటుంది. చాలా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రజలు నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించవచ్చు. నగదు అవసరమైన వారి కోసం ATMలు తెరిచి ఉంటాయి. అయితే, చెక్కులు జారీ చేయడానికి, పెద్ద-విలువ RTGS లావాదేవీలు నిర్వహించడానికి వారు బ్యాంకులకు సందర్శించాల్సి ఉంటుంది.
ఈ లింక్ ద్వారా ప్రాంతాల వారీగా బ్యాంకుల సెలవు దినాలను చెక్ చేసుకోండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి