Shark Tank India Season 2: బుజ్జి కారు భలే ఉందే.. ఎంచక్కా రిమోట్ తోనే ఆపరేట్ చేయొచ్చు.. ధర కూడా బడ్జెట్ లోనే..

|

Jan 28, 2023 | 4:43 PM

పీఎంవీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఫౌండర్ కల్పిట్ పటేల్ తన సరికొత్త ఆవిష్కరణ అయిన ఈఏఎస్-ఈ కారును గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిలోని బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే 160 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది. దీనిలోని ప్రాముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ఈ కారును రిపోట్ తో ఆపరేట్ చేయొచ్చు.

Shark Tank India Season 2: బుజ్జి కారు భలే ఉందే.. ఎంచక్కా రిమోట్ తోనే ఆపరేట్ చేయొచ్చు.. ధర కూడా బడ్జెట్ లోనే..
Pmv Eas E
Follow us on

ది షార్క్ ట్యాంక్ సీజన్ 2 అందరినీ ఆకట్టుకుంటుంది. అందులో వినూత్నమైన టెక్ ఆవిష్కరణలతో పాటు చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ ను ప్రజెంట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఎపిసోడ్స్ లో ప్రదర్శించిన ఓ ఎలక్ట్రిక్ కార్ ప్రత్యేకంగా నిలిచింది. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ ఆవిష్కరించిన ఈ ఎలక్ట్రిక్ కారు అందరినీ ఆకర్షించింది.

ప్రజెంటేషన్ సూపర్..

పీఎంవీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఫౌండర్ కల్పిట్ పటేల్ తన సరికొత్త ఆవిష్కరణ అయిన ఈఏఎస్-ఈ కారును గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిలోని బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే 160 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది. దీనిలోని ప్రాముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ఈ కారును రిపోట్ తో ఆపరేట్ చేయొచ్చు. కారులో ఏవరూ లేకుండా కూడా దానిని కంట్రోల్ చేయొచ్చు. అందుకే దీనిని క్వాడ్రిసైకిల్ గా దాని సృష్టికర్త పటేల్ ప్రకటించుకున్నారు. ఒక యాప్ సాయంతో ఈ కారును వినియోగించుకోవచ్చని ఆయన వివరించారు. అంతేకాక ఈ కారు నడపడానికి కిలోమీటర్ కు కేవలం 50 పైసా మాత్రమే ఖర్చువుతుందని ప్రకటించారు. ఇది సీఎన్జీ కన్న తక్కువని పటేల్ వివరించారు.

పర్యావరణ కాలుష్యానికి చెక్..

మినీకార్ల వేరియంట్లో ఇది ఆరో ప్రోటోటైప్ అని పటేల్ చెప్పారు. అంతకంతకూ పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఇది ఉపకరిస్తుందని చెప్పారు. అంతేకాక చాలా తక్కువ స్పేస్ ను తీసుకుంటుందని వివరించారు.

ఇవి కూడా చదవండి

దీని ధర ఎంతంటే..

ఈ కారు ప్రారంభ ధర రూ. 4 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. ఈ కార్ల ఉత్పత్తిని 2023లోనే ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ కారుకు సంబంధించిన ప్రమోషన్ వర్క్ ఎక్కడా ప్రారంభం కాలేదు. షార్క్ సీజన్ 2 లో పటేల్ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. అనంతరం ఆయన ఈ కార్ల ఉత్పత్తని ప్రారంభించించేందుకు రూ. కోటి అవసర అవుతుందని అందుకోసం ఒక శాతం ఈక్విటీతో రూ. కోటి పెట్టుబడి పట్టేవారు కావాలని పిలుపు నిచ్చారు. దీనిపై స్పందన బాగానే వచ్చినా.. పెట్టుబడిదారుల నుంచి వచ్చిన ప్రతిపాదనలు పటేల్ అంగీకరించకుండానే వెళ్లిపోయారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..