Credit Card: పెరుగుతున్న క్రెడిట్ కార్డు డిఫాల్ట్‌లు.. రూ. 2.7లక్షల కోట్లకు చేరిన అప్పులు..

|

Sep 29, 2024 | 5:24 PM

క్రెడిట్ కార్డుల వినియోగం విషయానికి వస్తే.. కరోనా ప్యాన్ డెమిక్ కు ముందు, ఆ తర్వాత అని చెప్పాలేమో. కరోనా వచ్చిన 2019 సమయంలో క్రెడిట్ కార్డుల ద్వారా మొత్తం అవుట్ స్టాండింగ్ డెబ్ట్ రూ. 87,686కోట్లు మాత్రమే ఉంది. అది 2024 జూన్ నాటికి ఏఖంగా రూ. 2.7లక్షల కోట్లకు చేరింది. దీనిని బట్టి గత ఐదు సంవత్సరాలలో కాంపౌండింగ్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) 24శాతానికి కన్నా పైగానే ఉంది.

Credit Card: పెరుగుతున్న క్రెడిట్ కార్డు డిఫాల్ట్‌లు.. రూ. 2.7లక్షల కోట్లకు చేరిన అప్పులు..
Credit Card
Follow us on

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం గణనీయంగా పెరిగింది. క్రెడిట్ కార్డు మంజూరు ప్రక్రియ సులభతరం కావడంతో చాలా మంది వీటిని వాడుతున్నారు. క్రెడిట్ కార్డులు ఎంత మేలు చేస్తాయో.. సమయానికి బిల్లులు చెల్లించకపోతే అంతే స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఆశ్చర్యకరంగా ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు డ్యూలు, డిఫాల్టులు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల ట్రాన్స్ యూనియన్ సిబిల్ విడుదల చేసిన ఓ నివేదిక స్పష్టం చేసింది. 2024, జూన్ నాటికి క్రెడిట్ కార్డు డిఫాల్టులు 1.8శాతానికి పెరిగాయని, 2023 డిసెంబర్లో అది 1.7శాతం ఉందని ట్రాన్స్ యూనియల్ సిబిల్ ఆ నివేదికలో స్పష్టంచేసింది. ఈ పర్సంటేజ్ చాలా తక్కువగానే అనిపిస్తున్నప్పటికీ.. మొత్తం క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించాల్సినవి(డ్యూస్) చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మొత్తం రూ. 2.7లక్షల కోట్లకు చేరింది. 2024 మార్చిలో ఈ డ్యూస్ మొత్తం రూ. 2.6లక్షల కోట్లుగా ఉంది. 2023, మార్చిలో రూ. 2లక్షల కోట్లు మాత్రమే ఉంది. దీనిని బట్టి క్రెడిట్ కార్డుల డిఫాల్టులు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం అవుతుంది.

కరోనా తర్వాత నుంచి..

క్రెడిట్ కార్డుల వినియోగం విషయానికి వస్తే.. కరోనా ప్యాన్ డెమిక్ కు ముందు, ఆ తర్వాత అని చెప్పాలేమో. కరోనా వచ్చిన 2019 సమయంలో క్రెడిట్ కార్డుల ద్వారా మొత్తం అవుట్ స్టాండింగ్ డెబ్ట్ రూ. 87,686కోట్లు మాత్రమే ఉంది. అది 2024 జూన్ నాటికి ఏఖంగా రూ. 2.7లక్షల కోట్లకు చేరింది. దీనిని బట్టి గత ఐదు సంవత్సరాలలో కాంపౌండింగ్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) 24శాతానికి కన్నా పైగానే ఉంది. ఈ ధోరణి క్రెడిట్ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాలు వంటి అసురక్షిత రుణ రంగంలో పెరుగుతున్న ఒత్తిడిని ప్రతిబింబిస్తుందని మార్కెట్ నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు.

మొత్తం లిమిట్ వాడేస్తూ..

కొత్తగా క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్న వారు కార్డులో మొత్తం పరిమితిని వాడేస్తున్నారు. అంతేకాక సమయానికి వాటి బిల్లులు చెల్లించకుండా డిఫాల్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత దానిని వాయిదాలలో చెలిస్తున్నారు. అప్పుడు వారికిపై అధిక వడ్డీ రేట్లు పడుతున్నాయి. వారి బాకీ ఉన్న బ్యాలెన్స్ చాలా గణనీయంగా పెరుగుతుంది కాబట్టి వారు కనీస చెల్లింపు మాత్రమే చేయగలుగుతారు. పర్యవసానంగా, చాలా మంది రుణగ్రహీతలు లోన్ స్టాకింగ్‌లో చిక్కుకుంటారు. ఆ అప్పును క్లియర్ చేయడానికి వ్యక్తిగత రుణాలను తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి డిఫాల్ట్ లు బహిరంగ మార్కెట్లో విక్రయించే కార్డులతోనే సంభవిస్తున్నాయని చెబుతున్నారు.

ఆర్బీఐ చర్యలు..

క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల వంటి అసురక్షిత రుణ రంగంలో ఒత్తిడి పెరుగుతుండటంతో పరిస్థితిని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే చర్యలు చేపట్టిందని నిపుణులు చెబుతున్నారు. నవంబర్ 2023లో ఆర్బీఐ తీసుకున్న చర్యలను అనుసరించి అసురక్షిత రుణ రంగంలో వృద్ధి రేటు 25% నుంచి 15%కి తగ్గిందని వివరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..