CNG Prices: పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు.. ఎంతంటే..!

CNG Prices: ప్రపంచ చమురు, గ్యాస్ వాణిజ్యంలో దాదాపు ఐదవ వంతు వాటా కలిగిన కీలకమైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధిపై దిగ్బంధనం కొనసాగుతూ, ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. దేశంలో ఇంధన కొరత..

CNG Prices: పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు.. ఎంతంటే..!
Cng Price

Updated on: May 15, 2026 | 9:00 AM

CNG Prices: హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద కొనసాగుతున్న దిగ్బంధం, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాల కారణంగా భారత్‌లో గ్యాస్ పంపిణీ సంస్థలపై ఖర్చు భారం పెరిగింది. దీంతో దేశీయంగా గ్యాస్ ధరలు పెరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి దిగ్బంధం కొనసాగుతున్నందున, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తర్వాత సీఎన్‌జీ (CNG) ధరను కూడా రూ. 2 పెంచారు. పెరిగిన ధరలో తక్షణమే అమలులోకి వచ్చాయి.

నగరాల వారీగా కొత్త ధరలు (సుమారుగా):

ఢిల్లీ: కిలో సిఎన్‌జి ధర ఇప్పుడు రూ. 77.59 కి చేరింది.

ముంబై: ఇక్కడ ధర దాదాపు రూ. 82.27 వరకు పెరిగింది.

ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా రవాణా ఖర్చులను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు.

ఆటోలు, క్యాబ్‌లు, బస్సుల నిర్వహణ ఖర్చు పెరగడంతో సామాన్యుల ప్రయాణ భారంగా మారనుంది.రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 పైగా పెరగడంతో బెంబేలెత్తిపోతున్న సామాన్యుడికి ఈ సిఎన్‌జి ధరల పెంపుతో మరింత భారంగా మారనుంది. హార్ముజ్ జలసంధి సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే, రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: బాబోయ్‌ మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఇక కొనడం కష్టమే..!

ప్రపంచ చమురు, గ్యాస్ వాణిజ్యంలో దాదాపు ఐదవ వంతు వాటా కలిగిన కీలకమైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధిపై దిగ్బంధనం కొనసాగుతూ, ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్రం పదేపదే చెబుతున్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఇంధన ధరల మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఎందుకంటే అది తన ముడి చమురు అవసరాలలో దాదాపు 90 శాతాన్ని దిగుమతి చేసుకుంటోంది.

ఇది కూడా చదవండి: Big Breaking: వాహనదారులకు షాకింగ్‌ న్యూస్‌.. భారత్‌లో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. లీటర్‌కు ఎంతంటే..

ఈ వారం మొదట్లో కేంద్ర చమురు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. తక్షణ సరఫరా అంతరాయాన్ని నివారించడానికి భారతదేశం వద్ద ప్రస్తుతం తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని అన్నారు. గత 75 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. కానీ గత 4 ఏళ్లుగా ధరలు పెంచలేదని, ప్రపంచంలో ఇలా చేయని ఏకైక దేశం మనమే అంటే కేంద్రం చెబుతోంది. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ధరలు పెంచుతున్నారని ప్రజలు అంటున్నారు. చివరిసారిగా 2022లో ధరలు పెంచినట్లు పెట్రోలియం శాఖ మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: బాబోయ్‌ మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఇక కొనడం కష్టమే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us