Cibil Score: క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తక్కువ ప్రాసెస్‌తో క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి బ్యాంకులు. క్రెడిట్ కార్డులు (Credit Cards) వాడిన తర్వాత సమయంలోగా బిల్లు చెల్లిస్తే మీ సిబిల్ స్కోర్ బాగుంటుంది. లేకపోతే సిబిల్ పడిపోయి మీకు భవిష్యత్తులు ఎలాంటి రుణాలు తీసుకునేందుకు అనర్హులు. క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నవారికి క్రెడిట్ స్కోర్ (Credit Score) అనేది చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోర్ అనేది రుణగ్రహిత క్రెడిట్ విలువను సూచిస్తుంది. రుణాలు తీసుకున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్ అందిస్తాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో తక్కువ రేట్లతో రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న రుణగ్రహీతలు అధిక రుణం ఉన్నవారు క్రమంగా రుణాన్ని చెల్లించకపోతే, బ్యాంకులు తక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వడం, లేదా రుణ దరఖాస్తులను తిరస్కరించడం చేస్తుంటాయి.
అయితే ప్రస్తుతం 750కి మించి క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడే రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతాయి బ్యాంకులు. ఈ స్కోర్ దాటిన వారికి బ్యాంకులు అధిక ప్రాధాన్యత ఇస్తుంటాయి. అయితే ఈ స్కోర్‌ను దాటాలంటే పెద్ద కష్టమైన పని కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మీరు చెల్లించాల్సిన వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తే చాలు క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లులను ఆలస్యంగా చెల్లించారు. దీంతో వారిపై స్కోర్ ప్రభావం పడుతుంది.
సెటిల్‌మెంట్‌తో ఇబ్బందే..
చాలా మంది రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోవడం వల్ల క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. రుణ గ్రహిత వరుసగా మూడు నెలలపాటు వాయిదాలు చెల్లించనట్లయితే బ్యాంకులు దానిని నిరర్ధక ఆస్తిగా పరిగణిస్తాయి. చెల్లింపులు పూర్తిగా నిలిచిపోతే డిఫాల్ట్‌గా పరిగణించి, బ్యాంకులు ఏదో ఒక విధంగా కొంత మొత్తాన్ని కట్టించుకునే ప్రయత్నాలు చేస్తాయి. దీనినే సెటిల్‌మెంట్ అని పిలుస్తారు. అంగీకరించిన మొత్తాన్ని చెల్లిస్తే ఆ అప్పును పూర్తి స్థాయిలో రద్దు చేస్తారన్నట్లు.
క్రెడిట్ బ్యూరోలకు సమాచారం..
బ్యాంకులు ఈ విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు సమాచారం అందిస్తాయి. దీని వల్ల ఆయా రుణాలను సెటిల్డ్ అని పేర్కొంటారు. క్రెడిట్ నివేదికలో ఇది కనిపించినప్పుడు బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తాయి. ఒక వేళ వాయిదా పడ్డ రుణాన్ని సెటిల్‌మెంట్ చేసుకుంటే వీలైతే దాని మొత్తం చెల్లించేందుకు ప్రయత్నించండి. దీని వల్ల సెటిల్ నుంచి క్లోజ్డ్‌కు మారుతుంది. క్రెడిట్ స్కోరు పెరిగేందుకూ వీలవుతుంది. మీ రుణ వాయిదాలను ఒక్కసారి ఆలస్యంగా చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ 100 పాయింట్లకు పైగా ప్రభావితం చేస్తుందని బ్యాంకు నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: