వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ వస్తువుల ధరలో మార్పులు. తగ్గేవేవీ, పెరిగేవి ఏవంటే..

మరో మూడు రోజుల్లో ఏప్రిల్‌ నెలలో అడుగు పెట్టబోతున్నాం. ఇది కొత్త నెల మాత్రమే కాకుండా కొత్త ఆర్థిక సంవత్సరకం కూడా కావడం విశేషం. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాం. సహజంగానే ఆర్థిక ఏడాది మారిన సమయంలో కొన్ని వస్తువుల ధరల్లో మార్పులు జరగడం సహజమే. ఇటీవల కేంద్ర ఆర్థిక..

వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ వస్తువుల ధరలో మార్పులు. తగ్గేవేవీ, పెరిగేవి ఏవంటే..
Goods Price

Updated on: Mar 28, 2023 | 4:57 PM

మరో మూడు రోజుల్లో ఏప్రిల్‌ నెలలో అడుగు పెట్టబోతున్నాం. ఇది కొత్త నెల మాత్రమే కాకుండా కొత్త ఆర్థిక సంవత్సరకం కూడా కావడం విశేషం. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాం. సహజంగానే ఆర్థిక ఏడాది మారిన సమయంలో కొన్ని వస్తువుల ధరల్లో మార్పులు జరగడం సహజమే. ఇటీవల కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో ఇంపోర్ట్‌ డ్యూటీ, టాక్స్‌ స్లాబ్స్‌లో మార్పుల వల్ల వస్తువుల ధరల్లో మార్పులు జరగనున్నాయి. బడ్జెట్‌లో చేసిన మార్పులు కారణంగా పెరగనున్న ధరలు ఏంటి.? తగ్గనున్న ధరలు ఏంటన్న వివరాలపై ఓ లుక్కేయండి..

ఈ వస్తువుల ధరలు పెరుగుతాయి..

ధరలు పెరిగే జాబితాలో ప్రైవేటు జెట్స్‌, హెలికాప్టర్లు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు వంటివి ఉన్నాయి. వీటితో పాటు వెండివస్తువులు, ప్లాటినం ధరలు కూడా పెరగనున్నాయి. ఇక ఇమిటేషన్‌ ఆభరణాలు, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు, సిగరెట్ల ధరలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి.

ధరలు తగ్గే వస్తువులు ఇవే..

ధరలు తగ్గే వస్తువుల జాబితాలో దుస్తులు, వజ్రాలు, రంగు రాళ్లు, బొమ్మలు, సైకిళ్లు, టీవీల ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు ఇంగువ, కాఫీ గింజలు, శీతలీకరించిన నత్తగుల్లలు, మొబైల్‌ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, కెమెరా లెన్స్‌ వంటి ఎలక్ట్రిక్‌ వస్తువులు ధరలు తగ్గనున్నాయి. భారత్‌లో తయారైన ఎలక్ట్రానిక్ వాహనాలతో పాటు పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు, లిథియం అయాన్ బ్యాటరీల ధరలు తగ్గనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..