Tax: రాష్ట్రాలకు పన్ను బకాయిలను విడుదల చేసిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు ఎంతో తెలుసా?

|

Jun 11, 2024 | 1:32 PM

జూన్ నెల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా కోసం కేంద్ర ప్రభుత్వం సోమవారం పన్నుల విభజనను పంపిణీ చేసింది. ఈ ఒక్క నెలలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక శాఖ మొత్తం రూ.1.39 లక్షల కోట్లు విడుదల చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్తరప్రదేశ్‌కే అత్యధిక వాటా లభించింది. ఆ అతిపెద్ద రాష్ట్రానికి 25 వేల కోట్లకు పైగా పన్ను సొమ్ము వచ్చింది. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా పన్ను వసూలు చేస్తున్న కర్ణాటకకు జూన్..

Tax: రాష్ట్రాలకు పన్ను బకాయిలను విడుదల చేసిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు ఎంతో తెలుసా?
Tax
Follow us on

జూన్ నెల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా కోసం కేంద్ర ప్రభుత్వం సోమవారం పన్నుల విభజనను పంపిణీ చేసింది. ఈ ఒక్క నెలలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక శాఖ మొత్తం రూ.1.39 లక్షల కోట్లు విడుదల చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్తరప్రదేశ్‌కే అత్యధిక వాటా లభించింది. ఆ అతిపెద్ద రాష్ట్రానికి 25 వేల కోట్లకు పైగా పన్ను సొమ్ము వచ్చింది. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా పన్ను వసూలు చేస్తున్న కర్ణాటకకు జూన్ నెలలో రూ.5,096 కోట్లు మాత్రమే వచ్చాయి.

వివిధ రాష్ట్రాల నుంచి వసూలు చేసిన జీఎస్టీ పన్ను సొమ్మును నెలవారీగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. రాష్ట్రాలకు మొత్తం పన్ను వసూలులో 41% వాటా ఇచ్చింది. జూన్ నెలలో నెలవారీ వాయిదాతో పాటు ఒక అదనపు వాయిదా జోడించింది. మొత్తం కలిపి రూ.1,39,750 కోట్లు.

ఫిబ్రవరిలో జరిగిన మధ్యంతర బడ్జెట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలకు 12.19 లక్షల కోట్ల రూపాయల పన్ను కేటాయింపును ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు 2.8 లక్షల కోట్లు కేటాయించారు. అంటే.. ఏప్రిల్ 1 నుంచి జూన్ 10 వరకు రాష్ట్రాలకు రూ.2.8 లక్షల కోట్ల పన్ను సొమ్ము అందజేసింది. జూన్ 2024లో రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసిన పన్ను మొత్తం పన్ను: రూ. 1,39,750.92 కోట్లు.

రాష్ట్రాల వారీగా..

  1. ఉత్తరప్రదేశ్: రూ. 25,069.88 కోట్లు
  2. బీహార్: రూ. 14,056.12 కోట్లు
  3. మధ్యప్రదేశ్: రూ. 10,970.44 కోట్లు
  4. పశ్చిమ బెంగాల్: రూ.10,513 కోట్లు
  5. మహారాష్ట్ర: రూ. 8,828.08 కోట్లు
  6. రాజస్థాన్: రూ. 8,421.38 కోట్లు
  7. ఒడిశా: రూ.6,327.92 కోట్లు
  8. తమిళనాడు: రూ. 5,700.44 కోట్లు
  9. ఆంధ్రప్రదేశ్: రూ. 5,655.72 కోట్లు
  10. కర్ణాటక: రూ. 5,096.72 కోట్లు
  11. గుజరాత్: రూ. 4,860.56 కోట్లు
  12. ఛత్తీస్‌గఢ్: రూ. 4,761.30 కోట్లు
  13. జార్ఖండ్: రూ. 4,621.58 కోట్లు
  14. అస్సాం: రూ. 4,371.38 కోట్లు
  15. తెలంగాణ: రూ.2,937.58 కోట్లు
  16. కేరళ: రూ. 2,690.20 కోట్లు
  17. పంజాబ్: రూ. 2,525.32 కోట్లు
  18. అరుణాచల్ ప్రదేశ్: రూ. 2,455.44 కోట్లు
  19. ఉత్తరాఖండ్: రూ. 1,562.44 కోట్లు
  20. హర్యానా: రూ. 1,527.48 కోట్లు
  21. హిమాచల్ ప్రదేశ్: రూ. 1,159.92 కోట్లు
  22. మేఘాలయ: రూ. 1,071.90 కోట్లు
  23. మణిపూర్: రూ. 1,000.60 కోట్లు
  24. త్రిపుర: రూ. 989.44 కోట్లు
  25. నాగాలాండ్: రూ. 795.20 కోట్లు
  26. మిజోరం రూ.698.78 కోట్లు
  27. సిక్కిం: రూ. 542.22 కోట్లు
  28. గోవా: రూ. 539.42 కోట్లు

Central Tax

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి