Fuel Prices: వాహనదారులకు భారీ ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం

|

May 21, 2022 | 8:21 PM

దేశప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్రం. పెట్రోల్‌ , డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోధరలు తగ్గబోతున్నాయి.

Fuel Prices: వాహనదారులకు భారీ ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం
Fuel Prices down
Follow us on

Petrol Diesel Price: వాహనదారులకు భారీ ఊరట దక్కింది. పెట్రోల్, డీజిల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని గణనీయంగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రకటించారు. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల లీటర్ పెట్రోల్ ధర 9.5 రూపాయల మేర, డీజిల్ ధర 7 రూపాయల మేర తగ్గనుంది.  ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం ప్రతిఏటా  దాదాపు లక్ష కోట్ల ఆదాయం కోల్పోతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో ద్రవ్యోల్బణం(inflation) పెరిగిపోవడంతో చమురు ధరలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. పెట్రోధరలు పెరగడంతో.. దాని ప్రభావం నిత్యావసర వస్తువులతో పాటు అన్ని వస్తువులపై కూడా ఉంది.  దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఓవైపు కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. పెట్రో బాదుడు కారణంగా బస్సు ఛార్జీలు, నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వారికి ఊరటనిచ్చింది.

అంతేకాకుండా డొమెస్టిక్‌ గ్యాస్‌ బండపై కూడా సబ్సిడీని పెంచింది.  ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు ఏడాదికి 12 సిలిండర్లపై రూ. 200 చొప్పున సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా సుమారు రూ.6100 కోట్లు రెవెన్యూ నష్టం వస్తుందన్నారు.

దిగుమతులపై అధికంగా ఆధారపడే ప్లాస్టిక్​ ఉత్పత్తుల ముడి పదార్థాలపై కస్టమ్స్​ డ్యూటీని తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీని ద్వారా తయారీ ఖర్చు తగ్గుతుందన్నారు. అలాగే ఇనుము, స్టీల్​ ఉత్పత్తుల ధరలు తగ్గించేందుకు ముడి సామగ్రిపై కస్టమ్స్​ డ్యూటీ తగ్గిస్తున్నట్లు చెప్పారు. సిమెంట్ ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

 

F3 ఈవెంట్ లైవ్ దిగువన చూడండి….