
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ మయం అవుతోంది. కూరగాయల నుంచి గృహోపకరణల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తున్నాయి.

తాజాగా ఈ జాబితాలోకి గ్యాస్ సిలిండర్‌లు కూడా వచ్చి చేరాయి. దీంతో గంటల్లోనే గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చేస్తోంది.

ఈ క్రమంలోనే వినియోగదారులను ఆకర్షించే క్రమంలో పలు సంస్థలు క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా 'ఇండియన్ గ్యాస్' సిలిండర్ బుక్ చేసుకుంటే అమేజాన్ రూ.50 క్యాష్ బ్యాక్ అందిస్తోంది.

ఇందుకోసం అమేజాన్ యాప్‌లోకి వెళ్లి.. Amazon Pay పైన క్లిక్ చేయాలి. తర్వాత Book your LPG Cylinder క్లిక్ చేసి Pay Now ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత రూ.50 మీకు క్యాష్ బ్యాక్ రూపంలో లభిస్తుంది.

ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిట్ ట్విట్టర్ వేదికగా స్వయంగా తెలిపింది.