మీరు కారు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? ఇలాంటి సందర్భంలో లోన్ తీసుకోవాలనుకుంటే, కారు లోన్‌పై వడ్డీ రేట్లు(interest rates), బ్యాంక్ ఆఫర్‌లు(bank offer), కొత్త కారును తీసుకోవాలా లేదా ఉపయోగించిన కారును తీసుకోవాలా అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఇటువంటి కొన్ని ప్రశ్నలకు మేం ఇక్కడ సమాధానాలు ఇవ్వబోతున్నాం. వాస్తవానికి కారు (car loan)కొనడం అనేది చాలా మంది భారతీయులకు పెద్ద నిర్ణయం. దీనిలో వారు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా దీర్ఘకాలిక రుణ ఆఫర్‌లను తీసుకుంటారు. ఇటువంటి పరిస్థితిలో, ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం సరైనది. ఈ చిట్కాలను పూర్తిగా తెలుసుకొని కారు కొనడానికి ఉత్తమ నిర్ణయం తీసుకోండి.
కారు లోన్ రేట్లు ఎలా ఉన్నాయి..
BankBazaar.comలో అందించిన సమాచారం ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా 7 శాతం ప్రారంభ రేటుతో కారు రుణాన్ని అందిస్తోంది. దీనితో పాటు బ్యాంకు ప్రాసెసింగ్ రుసుం రూ.1500 వసూలు చేస్తోంది. అదే సమయంలో, కెనరా బ్యాంక్ 7.3 శాతం ప్రారంభ రేటుతో రుణాన్ని అందిస్తోంది. బ్యాంకు రుణం మొత్తంలో 0.25 శాతం ప్రాసెసింగ్ రుసుమును వెయ్యి నుంచి రూ. ఐదు వేల రూపాయల వరకు వసూలు చేస్తోంది. యాక్సిస్ బ్యాంక్ 7.45 శాతం ప్రారంభ రేటుతో రుణాన్ని అందిస్తోంది. అదే సమయంలో, బ్యాంకు రూ. 3500 నుంచి రూ. 7000 రూపాయల మధ్య ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తోంది. ఇది రుణ మొత్తాన్ని బట్టి నిర్ణయిస్తుంది. SBI 7.2 శాతం చొప్పున రుణాన్ని అందిస్తోంది. అంటే, సాధారణంగా స్థిరమైన ఆదాయం ఉన్న కస్టమర్ 7 నుంచి 7.5 శాతం మధ్య రుణాన్ని పొందవచ్చు.
వివిధ కస్టమర్ సెగ్మెంట్ల కోసం వివిధ బ్యాంక్ ఆఫర్లు..
మీరు లగ్జరీ కారును పొందాలనుకుంటే, మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను సంప్రదించడం మంచిది. ఇక్కడ మీరు మీ అవసరాలకు అనుగుణంగా రుణాలు పొందుతారు. అయితే ఆన్‌రోడ్ ధరకు 100 శాతం ఫైనాన్స్ పొందవచ్చు. అదే సమయంలో, SBI కూడా ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. అంటే సీఏ, డాక్టర్ తదితరాలు ఎస్బీఐ నుంచి రుణం తీసుకోవచ్చు. మీరు చిన్న, చవకైన కారుని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు Axis బ్యాంక్ నుంచి బెనిఫిట్ ఆఫర్‌ను పొందవచ్చు. బ్యాంక్ మార్కెట్ ప్రకారం, Axis బ్యాంక్ కూడా చాలా కాలం పాటు రుణాన్ని ఇస్తుంది. అలాగే మీ EMIని కూడా తగ్గిస్తుంది.
కొత్త కారు లేదా వాడిన కారు..
మీరు ఉపయోగించిన కారును కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, అది మీకు మరింత వెలసులుబాటును కలిగించకపోవచ్చు. ఉపయోగించిన కార్లపై అధిక వడ్డీ రేటుతోపాటు అధిక EMIలకు దారితీసే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో, సెకండ్ హ్యాండ్ కారును కొనాలనుకుంటే మాత్రం కారు కూడా మంచి స్థితిలో ఉంటేనే రుణం తీసుకొని కారును కొనుగోలు చేయండి. అయితే, యూజ్డ్ కార్ ఆఫర్ అంతగా వర్క్‌టౌ కాకపోతే ప్రారంభంలో తక్కువ EMI ఉండే బ్యాంకు నుంచి కొత్త కారు కోసం కస్టమైజ్డ్ లోన్ తీసుకోవడం మంచిది. ఇది పాత కారు వల్ల కలిగే ఏదైనా నష్టం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. డబ్బు ఆదా చేయడానికి మరియు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడానికి తరచుగా ప్రజలు పాత కార్లను కొనుగోలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో, బ్యాంకును సంప్రదించి, కారు లోన్‌కు సంబంధించిన అన్ని పథకాల గురించి సమాచారాన్ని పొందండి.
గమనిక: బ్యాంక్ ఆఫర్‌లు లేదా నియమాలు మారుతూనే ఉంటాయి. కారు తీసుకునే ముందు, ముందుగా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థలను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచింది.
Also Read: UPI: ఇకపై ఆ దేశంలోనూ యూపీఐ సేవలు.. భారత్ వెలుపల యూపీఐ ఉపయోగిస్తున్న తొలి దేశం..