Credit Card Bill: మీ క్రెడిట్‌ కార్డు బకాయి తీర్చలేకపోతున్నారా? నో టెన్షన్‌.. ఇలా చేయండి

|

Jun 06, 2024 | 6:18 PM

ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డులు వాడేవారు చాలా మందే ఉన్నారు. బ్యాంకులు కూడా సులభంగా క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు కార్డు జారీ చేయాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. పూర్తిగా ఎంక్వేరీ చేసిన తర్వాతే కార్డు జారీ చేసేవి బ్యాంకులు. అందుకు సమయం కూడా పట్టేది. కానీ ఇప్పుడు డిజిటల్‌ యుగంలో క్రెడిట్‌ కార్డులను సులభంగా జారీ చేస్తున్నాయి. కేవలం ఫోన్‌ల ద్వారానే వివరాలు పూర్తి..

Credit Card Bill: మీ క్రెడిట్‌ కార్డు బకాయి తీర్చలేకపోతున్నారా? నో టెన్షన్‌.. ఇలా చేయండి
Creditcard
Follow us on

ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డులు వాడేవారు చాలా మందే ఉన్నారు. బ్యాంకులు కూడా సులభంగా క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు కార్డు జారీ చేయాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. పూర్తిగా ఎంక్వేరీ చేసిన తర్వాతే కార్డు జారీ చేసేవి బ్యాంకులు. అందుకు సమయం కూడా పట్టేది. కానీ ఇప్పుడు డిజిటల్‌ యుగంలో క్రెడిట్‌ కార్డులను సులభంగా జారీ చేస్తున్నాయి. కేవలం ఫోన్‌ల ద్వారానే వివరాలు పూర్తి చేసి కార్డులను అందిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డు వాడకంలో అవగాహన ఉండటం తప్పనిసరి లేకుంటే అప్పుడు ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అయితే చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లును సమయానికి చెల్లించరు. గడువులోగా చెల్లించకుంటే భారీగా పెనాల్టీ పడుతుంది. మరి బాకీ ఉన్న బిల్లును చెల్లించకుంటే ఏవమతుంది? అలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం.

మీ కార్డును ఉన్న బకాయినీ నెలవారీ పద్దతుల్లో అంటే ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు. మీ బిల్లును ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. దీని వల్ల మీ క్రెడిట్‌ కార్డు బకాయిని చెల్లించడంలో సులభం అవుతుంది. లేదా ఆ బకాయిని వేరే కార్డుకు బదిలీ చేసుకుని వ్యక్తిగత రుణంగా చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది.

తక్కువ వడ్డీ రేట్లు: వ్యక్తిగత రుణాలతో క్రెడిట్‌ కార్డులను పోల్చినట్లయితే వడ్డీ తక్కువగానే ఉంటుంది. అందుకే కాలక్రమేణా వడ్డీపై డబ్బు ఆదా అవుతుంది. అంతేకాకుండా బాకీని వేగంగా తీర్చేందుకు సులభమవుతుంది. మీ క్రెడిట్‌ కార్డు బిల్లు మొత్తం తీర్చడంలో ఇబ్బంది ఉంటే మీరు బ్యాంకు నుంచి లేదా ఇతర సంస్థల నుంచి వ్యక్తగత రుణం తీసుకుని క్రెడిట్‌ కార్డు బకాయిని తీర్చుకోవచ్చు.

క్రెడిట్‌ స్కోరు: బిల్లును తీర్చకుండా విఫమైలే క్రెడిట్‌ స్కోరు పడిపోతుంది. క్రెడిట్‌ వినియోగ నిష్పత్తీ పెరుగుతుంది. దీనికి బదులుగా రుణంతో ఒకేసారి బాకీ తీరిస్తే, క్రెడిట్‌ స్కోరు మెరుగయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

ఫీజుల బాధ: గడువు సమయంలోగా క్రెడిట్‌ కార్డు బల్లు చెల్లించకుంటే భారీ పెనాల్టీ ఛార్జీలు పడతాయి.రుణం తీసుకొని, చెల్లిస్తే.. వీటి బాధ ఉండదు. రుణం తీసుకునే ముందు కూడా కొన్ని విషయాలను పరిశీలించుకోవాలి. మీ క్రెడిట్‌ కార్డు బిల్లును తీర్చేందుకు వ్యక్తిగత రుణం తీసుకునేందుకు మీకు అర్హత ఉందా అనేది ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ముందుగా మీ బ్యాంకును సంప్రదించాలి. క్రెడిట్‌ స్కోరు, ఆదాయం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని బ్యాంకులు మీరు రుణాన్ని అందిస్తాయి.

కొన్ని బ్యాంకులు 12 నుంచి 84 నెలల వరకూ వ్యవధితో రుణాలను ఇస్తున్నాయి. రుణాన్ని సులభంగా చెల్లించే విధంగా వాయిదాలను నిర్ణయించుకోండి. కానీ బ్యాంకు నుంచి రుణం తీసుకుని క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లిస్తే సరిపోదు.. మీరు తీసుకున్న లోన్‌ ఈఎంఐ సరిగ్గా చెల్లించడం చాలా ముఖ్యం. లేకుంటే తర్వాత మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి