Aadhaar News: ఆధార్‌లో ఆన్‌లైన్ ద్వారా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయవచ్చా.? అసలు విషయం తెలిస్తే షాక్

|

Oct 14, 2024 | 10:16 PM

ప్రతిదీ డిజిటల్‌గా మారుతున్న ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ ప్రయోజనాల వరకు వివిధ సేవలకు ఆధార్ అనేది తప్పనిసరైంది. ఇటీవల కాలంలో ఆధార్ కార్డ్ కీలకమైన గేట్‌వేగా మారింది. అయితే ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆధార్‌లో మీ మొబైల్ నంబర్‌ని మార్చడం అనేది కష్టతరమని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా ఆధార్ నమోదు సమయంలో మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీని అందించడం తప్పనిసరి కాదు.

Aadhaar News: ఆధార్‌లో ఆన్‌లైన్ ద్వారా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయవచ్చా.? అసలు విషయం తెలిస్తే షాక్
Follow us on

ప్రతిదీ డిజిటల్‌గా మారుతున్న ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ ప్రయోజనాల వరకు వివిధ సేవలకు ఆధార్ అనేది తప్పనిసరైంది. ఇటీవల కాలంలో ఆధార్ కార్డ్ కీలకమైన గేట్‌వేగా మారింది. అయితే ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆధార్‌లో మీ మొబైల్ నంబర్‌ని మార్చడం అనేది కష్టతరమని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా ఆధార్ నమోదు సమయంలో మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీని అందించడం తప్పనిసరి కాదు. అయితే మీ ఆధార్ అప్లికేషన్ స్టేటస్‌పై అప్‌డేట్‌లను అందుకోవడానికి, ఓటీపీ ఆధారిత ప్రామాణీకరణ ద్వారా వివిధ ఆధార్ ఆధారిత సేవలను యాక్సెస్ చేయడానికి ఈ వివరాలను అందించాలని సిఫార్సు చేయబడింది. నాన్-రెసిడెంట్ ఇండియన్స్, రెసిడెంట్ ఫారిన్ నేషనల్స్ ఆధార్ కోసం తప్పనిసరిగా ఈ-మెయిల్ ఐడీను అందించాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆధార్‌లో ఉన్న మొబైల్ నెంబర్‌ను ఎలా మార్చాలో? ఓసారి తెలుసుకుందాం. 

ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ లేదా ఈ-కేవైసీ ప్రాసెస్‌లను యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ కోసం వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను (ఓటీపీ) పంపడానికి మీ మొబైల్ నంబర్ కీలకంగా ఉంటుంది. ఇది మీ లావాదేవీలకు అదనపు భద్రతను అందిస్తుంది. పాన్ కార్డ్ లింక్ చేయడం, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ లేదా బ్యాంక్ ఖాతాలను తెరవడం వంటి అనేక ఆన్‌లైన్ సేవలకు ధ్రువీకరణ కోసం మీ ఆధార్ అవసరం అవుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు ఆధార్‌కు వర్కింగ్ మొబైల్ నంబర్‌ కలిగి ఉండడం కీలకంగా ఉంటుంది. 

మీరు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లోని మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయవచ్చా?

మొబైల్ నంబర్ అప్‌డేట్‌లు ఆన్‌లైన్‌లో చేయలేమని నిపుణులు చెబుతున్నారు. మీరు సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించడం ద్వారా లేదా పోస్ట్‌మ్యాన్ సేవను ఉపయోగించడం ద్వారా మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌లో అప్‌డేట్ చేయవచ్చు. అప్‌డేట్ కోసం ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్‌లు లేదా పాత మొబైల్ నంబర్ అవసరం లేదు. అలాగే భువన్ పోర్టల్‌కు వెళ్లి సమీప ఆధార్ నమోదు కేంద్రాన్ని కనుగొనవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..