కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనడానికి ఇప్పుడే చెప్పే వ్యక్తి స్టోరీ పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు సాధారణ టీచర్.. క్లాస్ రూంలో విద్యార్థులకు లెసన్స్ చెప్తూ ఉండేవాడు. కట్ చేస్తే.. ఏడేళ్లలోనే ఇండియాలో కొత్త బిలియనీర్‌గా చరిత్ర సృష్టించాడు. ఎడ్యుకేషన్ యాప్ డెవలప్ చేసిన అతడు.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగి బిలియనీర్ క్లబ్‌లో చేరాడు. అతడే.. బైజూ రవీంద్రన్. ఆన్ లైన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా ఉన్న ఆయన.. ఇటీవలే 150 మిలియన్ డాలర్ల నిధులను సాధించిన తరువాత అరుదైన క్లబ్‌లో చేరాడు. తాజాగా ఓ కంపెనీతో చేసుకున్న ఒప్పందం ద్వారా సంస్థకు 5.7 బిలియన్ డాలర్ల విలువను అందించింది. రవీంద్రన్‌కు 21శాతం ప్రాపిట్ షేర్ ఉన్నట్లు తెలుస్తోంది.
యానిమేటడ్ వీడియోల ద్వారా టీచింగ్: తన కొత్త యాప్‌లో డిస్నీలోని పాత్రలయిన లయన్ కింగ్స్ సింబా నుంచి ఫ్రోజెన్ అన్నా వరకు మూడు తరగతుల విద్యార్థులకు గణితం, ఇంగ్లీష్ నేర్పించేవాడు. దీంతో పిల్లలు విపరీతంగా కనక్టయ్యారు. దేశంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరగడంతో పాటు డిజిటిల్ లెసన్స్ పట్ల కూడా ఆసక్తి పెరగడంతో బైజూ యాప్ జనాల్లోకి చొచ్చుకుపోయింది.
బైజూ వ్యవస్థాపకుడు రవీంద్రన్ కేరళలోని కన్నూర్ జిల్లాలోని అజికోడ్‌కు చెందినవారు. ఆయన తల్లిదండ్రుల కూడా టీచర్సే. ఇంజినీర్ పట్టా పొందిన తర్వాత 2015లో తన విద్యకు సంబంధించి ప్రధాన యాప్ ప్రారంభించాడు. అంతకుముందు ఆన్‌లైన్ పాఠాలను అందిస్తూనే 2011లో థింక్ & లెర్న్ కంపెనీని స్థాపించాడు. అక్కడి నుంచి రవీంద్రన్ అంచెలంచెలుగా ఎదుగుతూ బిలియనీర్ స్థాయికి చేరుకున్నాడు.