Gold Price in 2024: వామ్మో బంగారం.. 2024 చివరి నాటికి తులం గోల్డ్‌ ధర ఆ మార్క్‌ దాటడం ఖాయం.?

|

Jan 01, 2024 | 8:37 AM

2024 చివరి నాటికి తులం బంగారం ఏకంగా రూ. 70,000కి చేరడం ఖాయమని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూపాయి స్థిరంగా ఉండడం, భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం వంటి కారణాలతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రూ. 70 వేల మార్క్‌ చేరుకోవడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్‌ ప్రారంభం నుంచి బంగారం ధరలో భారీగా...

Gold Price in 2024: వామ్మో బంగారం.. 2024 చివరి నాటికి తులం గోల్డ్‌ ధర ఆ మార్క్‌ దాటడం ఖాయం.?
Today Gold Price
Follow us on

తరాలు మారుతున్నా, యుగాలు మారుతున్నా.. బంగారానికి ఉన్న విలువ మాత్రం చెక్కుచెదరడం లేదు. రోజురోజుకీ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 63,870కి చేరింది. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లోనూ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

2024 చివరి నాటికి తులం బంగారం ఏకంగా రూ. 70,000కి చేరడం ఖాయమని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూపాయి స్థిరంగా ఉండడం, భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం వంటి కారణాలతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రూ. 70 వేల మార్క్‌ చేరుకోవడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్‌ ప్రారంభం నుంచి బంగారం ధరలో భారీగా పెరుగుదల కనిపంచింది. మే 4వ తేదీన భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 61,845గా ఉండగా ప్రపంచ మార్కెట్‌లో ఔన్స్‌ 2,083 డాలర్లకు చేరుకుంది. అనంతరం నవంబర్‌ 16వ తేదీన తులం బంగారం రూ. 61,914కి చేరింది. ఇక డిసెంబర్‌ 4వ తేదీ నాటికి 10 గ్రాముల గోల్డ్‌ రూ. 64,063కి చేరుకుంది. ప్రపంచ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 2140 అమెరికన్‌ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది.

ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే.. 2024 నాటికి ఔన్స్‌ బంగారం ధర 2400 డాలర్లకు చేరుంతుందని, దేశీయ మార్కెట్‌లో తులం బంగారం రూ.70 వేలకి చేరడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయమై కొటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్, హెడ్‌ కమోడిటీ రీసెర్చ్‌ రవీంద్ర రావు మాట్లాడుతూ.. రిటైల్ ఆభరణాల కొనుగోలు విషయంలో ధరల పెరుగుదల కారణంగా ఎదురుగాలిని ఎదుర్కొందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఊపందుకోవడం కొనసాగతే సెంట్రల్‌ బ్యాంకుల డిమాండ్‌ గత ఏడాది రికార్డును అధిగమించవచ్చని అన్నారు.

ప్రస్తుతం భౌగోళిక, రాజకీయ వాతావరణం, ప్రపంచ వృద్ధి మందగించడం, ఆర్థిక అనిశ్చితుల కారణంగా బంగారంపై పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతన్నారు. ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ మెహ్రా మాట్లాడుతూ.. బంగారం ధరలోని అస్థిరత అమ్మకాలపై ప్రభావం చూపిందని, ఏడాదిలో సుమారు 35 లక్షల వివాహాలు జరిగినప్పటికీ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..