AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం కొంటున్నారా.. కక్కుర్తితో అలా చేస్తే మీ కొంప కొల్లేరే..!

భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం లాగా మాత్రమే కాకుండా సంప్రదాయంగా కూడా చెప్పొచ్చు. అందుకే బంగారం కొనుగోలు చేసే సమయంలో పలు విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని అంటున్నారు. అలానే ఆ సమయంలో తాత్కాలికంగా కొంత డబ్బు ఆదా చేసుకోవడం కోసం చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయని సూచిస్తున్నారు. ఆ విషయాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

బంగారం కొంటున్నారా.. కక్కుర్తితో అలా చేస్తే మీ కొంప కొల్లేరే..!
Gold Buying Tips
Korivi Jayakumar
|

Updated on: Nov 28, 2026 | 5:28 PM

Share

భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం లాగా మాత్రమే కాకుండా సంప్రదాయంగా కూడా చెప్పొచ్చు. అందుకే పెళ్లిళ్లు, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అయితే బంగారం కొనేటప్పుడు ధర, డిజైన్‌తో పాటు ఖచ్చితంగా చేయాల్సిన పని ఒకటి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అదే బిల్లు.. సాధారణంగా బంగారంపై జీఎస్టీ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బంగారానికి నిర్ణయించిన జీఎస్టీని కలిపి బిల్లులో పొందుపరుస్తారు. అయితే ఆ జీఎస్టీ డబ్బును ఆదా చేసుకోవాలని అనుకునే వారు బిల్లు తీసుకోకుండా బంగారం కొనుగోలు చేస్తుంటారు. దీన్నే జీరో బిల్ కొనుగోలు అంటారు.

కాగా ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తి రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు సిద్దమయ్యారు. ఆ మొత్తం బంగారం విలువతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ కలిపి కట్టాల్సి ఉంటుంది. మేకింగ్ ఛార్జీలు రూ.10 వేలు అయితే మొత్తం రూ.5.10 లక్షలపై జీఎస్టీ చెల్లించాలి. అందులోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా చెరో సగం ఉంటుంది. అయితే సదరు వ్యక్తి బిల్లు లేకుండా కొనడం ద్వారా ఆ రూ.5 లక్షలపై రూ.15 వేల వరకు ఆదా చేశాడని అనుకుందాం. ఈ రకంగా సదరు కస్టమర్ తాత్కాలికంగా కొంత డబ్బు ఆదా చేసుకున్నా కానీ భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలని చెబుతున్నారు. అవేంటి అంటే..

బంగారం కొనుగోలులో బిల్లు ఎందుకు ముఖ్యం?

  • బంగారం ఎక్కడ, ఎప్పుడు, ఎంత ధరకు కొనుగోలు చేశారో నిరూపించడానికి బిల్లు ఉపయోగపడుతుంది.
  • బంగారం కొనుగోలుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, దాని మూలం ఏమిటో వివరించడానికి బిల్లు ఆధారంగా ఉంటుంది.
  • పాత బంగారాన్ని విక్రయించే సమయంలో అసలు కొనుగోలు వివరాలు, ధరకు సంబంధించిన ఆధారంగా ఉపయోగపడుతుంది.
  • పాత బంగారాన్ని ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునేటప్పుడు గత కొనుగోలు వివరాలు తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
  • ఆభరణాలు పోయినా, దొంగతనానికి గురైనా లేదా ఇతర నష్టం జరిగినా బిల్లు విలువకు సంబంధించిన ఆధారంగా ఉపయోగపడుతుంది.
  • ఆభరణాల బరువు, ధర, కొనుగోలు తేదీ వంటి అంశాలపై జువెల్లర్‌తో సమస్య తలెత్తితే బిల్లు ఉపయోగపడుతుంది.
  • బంగారం ధర, మేకింగ్ ఛార్జీలు, పన్ను ఎంత చెల్లించారనే వివరాలు తెలుసుకోవడం కోసం.

హాల్‌మార్క్ చెక్..

జీఎస్టీ బిల్లు ఉండటం బంగారం స్వచ్ఛతకు హామీ కాదని.. అందుకోసం హాల్‌మార్క్ పరిశీలించాలని కోరుతున్నారు. ఆభరణంపై 22K916 వంటి స్వచ్ఛత గుర్తింపు, BIS హాల్‌మార్క్, ఆరు అంకెల HUID నంబర్ ఉన్నాయో లేదో చూడాలి. BIS Care యాప్‌లో Verify HUID ద్వారా దాన్ని తనిఖీ చేయవచ్చు. మొత్తంగా షోరూమ్ నుంచి బయటికి వచ్చే ముందే బంగారం గ్రాము ధర, నికర బరువు, మేకింగ్ ఛార్జీలు, తరుగు, జీఎస్టీ వివరాలను బిల్లులో పరిశీలించాలి. పాత బంగారం ఇస్తుంటే దాని బరువు, స్వచ్ఛత, విలువకు సంబంధించిన రాతపూర్వక రసీదు తీసుకోవాలి. కొనుగోలు బిల్లుతో పాటు చెల్లింపు ఆధారాలను కూడా భద్రపరచుకోవాలి.

గమనిక.. మరోవైపు బిల్లు లేకపోవడం వల్ల బంగారం అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఆటోమేటిక్‌గా నిర్ధారణ కాదని వివరిస్తున్నారు. అయితే దాని మూలాన్ని వివరించడం కష్టమవుతుందని.. సీజీఎస్టీ చట్టం సెక్షన్ 31 ప్రకారం నిబంధనలకు లోబడి రిజిస్టర్డ్ వ్యాపారులు ట్యాక్స్ ఇన్‌వాయిస్ జారీ చేయాలని స్పష్టం చేస్తున్నారు.

Follow Us