Anand Mahindra: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నెట్టింట్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. కొన్నిసార్లు స్ఫూర్తి నింపే మాటలు, బిజినెస్ సూచనలు చేస్తుంటారు. మరికొన్ని సార్లు చమత్కారాలు విసురుతారు. అప్పుడప్పుడు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తారు. మరికొన్నిసార్లు స్పూర్తిగా నిలిచేవారి రియల్ లైఫ్ స్టోరీలనూ పంచుకుంటుంటారు. తాజాగా ఆయనకు ఎదురైన ఓ ప్రశ్నకు.. తెలివిగా ఇచ్చిన సమాధానం నెటిజన్లను మెప్పిస్తోంది.
మహీంద్రా సంస్థ నుంచి సరికొత్త స్కార్పియో(Scorpio) లాంచ్ గురించి ఓ నెటిజన్ ఆనంద్‌ను ప్రశ్నించారు. దాని రాకకోసం ఎదురు చేస్తున్నామని, లాంచ్ డేట్ చెప్పాలని కోరాడు. ష్.. నేను మీకు చెప్తే.. నా ఉద్యోగం ఊడిపోతుంది అంటూ తెలివిగా బదులిచ్చారు. నేను కూడా మీలాగే కొత్త మోడల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను అంటూ చమత్కరంగా బదులిచ్చారు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ఆనంద్ మహీంద్రా భలే తప్పించుకున్నారే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘నేను చూసిన వాటిలో అత్యంత సరదా ట్వీట్ ఇది’, ‘మీరే యజమాని. మిమ్మల్ని ఎవరు ఫైర్ చేస్తారులేండి’ అంటూ యూజర్లు మహీంద్రా సమాదానికి బదులిస్తూ ట్విట్లు చేస్తున్నారు.
Sshhhh. If I tell you, I’ll be fired… But I can say this much..I’m as excited as you are… https://t.co/6EnseHYZDE
— anand mahindra (@anandmahindra) May 6, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
IPO News: 60% పతనమైన Nykaa, Paytm, Zomato విలువ.. ఇన్వెస్టర్ల భవిష్యత్తు బంగారమేనట ఎందుకంటే..!