Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించండి.. ఇంట్లో కూర్చొని ఈ వ్యాపారం చేయండి..

|

Feb 06, 2023 | 6:24 PM

తక్కువ ధరతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారం చేయాలంటే మీకు ఊరగాయ పెట్టడంలో అనుభవం ఉంటే చాలు. వెంటనే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. అది కూడా మీ ఇంటివద్దే..

Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించండి.. ఇంట్లో కూర్చొని ఈ వ్యాపారం చేయండి..
Pickle Making Business
Follow us on

నేటి కాలంలో చాలా మంది ఉద్యోగం చేయడం కంటే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికే ఇష్టపడుతున్నారు. కానీ ఏదైనా వ్యాపార ప్రణాళిక కారణంగా అలా చేయలేకపోతున్నారు. అయితే, మీరు గృహిణి అయితే మరియు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మేము మీకు ఊరగాయల వ్యాపార ప్రణాళిక గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. మీరు చాలా తక్కువ ధరతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారం చేయాలంటే మీకు ఊరగాయ పెట్టడంలో అనుభవం ఉంటే చాలు. వెంటనే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. అది కూడా మీ ఇంటివద్దే ఉంటు ఈ వ్యాపారంతో బోలెడంత డబ్బులు సంపాదించవచ్చు. గృహిణులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈ ఊరగాయ వ్యాపారం ద్వారా కొంత ఉపాది పొందడానికి అవకాశాలు కలుగుతుంది.

ప్రతి తెలుగువారు ఎంతో ఇష్టంగా తీసుకునే భోజనంలో ఊరగాయకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, మాంసంతో ఊరగాయను తయారు చేసి ఉన్న శిఖరాలను అధిరోహించినవారు ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు. సాధారణంగా చూడడానికి ఇది చిన్న పనే అనిపించినప్పటికీ దేశ వ్యాప్తంగా 80శాతం మంది ఏదో ఒక సంధర్భంలో పచ్చళ్ల కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే మన ఇంట్లో ఒకటి లేదా రెండు రకాల పచళ్లను మాతమే తయారు చేసుకుంటాం. అయితే, ఎంతో ఇష్టమైన పచ్చళ్లను పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఎక్కువ అమ్ముడు పోయే ఉత్పత్తులను తయారు చేసి అమ్మడం ద్వారా మనం కూడా ఎక్కువ సంపాదించేందుకు మంచి అవకాశం అనేది గుర్తించుకోవాలి.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. మీకు ఇంట్లో 400 నుంచి 500 చదరపు అడుగుల గది అవసరం. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీరు రూ. 10,000 వరకు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. దీని తర్వాత మీరు ప్రతి నెలా రూ.30,000 నుండి రూ.40,000 వరకు సంపాదించవచ్చు. మీ వ్యాపారం పెద్దదైతే, ఈ సంపాదన అనేక రెట్లు పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఆన్‌లైన్ విక్రయాలు, హోల్‌సేల్ మార్కెట్, రిటైల్ మార్కెట్‌లో కూడా ఊరగాయలను విక్రయించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి.. ఊరగాయ తయారీలో సరైన శిక్షణ తీసుకోండి. దీని తర్వాత మీరు FSSAI నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఊరగాయ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం