Budget 2026: హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారికి బడ్జెట్‌లో తీపి కబురు? HRA మార్పులకు అవకాశం..!

కేంద్ర బడ్జెట్ 2026లో మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.5-6 లక్షలకు, పన్ను రహిత ఆదాయం రూ.15 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. HRA మెట్రో నగరాల విషయంలో కూడా మార్పులు జరగొచ్చు.

Budget 2026: హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారికి బడ్జెట్‌లో తీపి కబురు? HRA మార్పులకు అవకాశం..!
Union Budget 2026 27

Updated on: Jan 21, 2026 | 10:05 PM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ 2026ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఒక విషయం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌. 2025 బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేయడం ద్వారా మధ్యతరగతికి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇది ప్రామాణిక తగ్గింపు తర్వాత రూ.12.75 లక్షలకు పెరిగింది. ఇప్పుడు బడ్జెట్ 2026లో కూడా అలాంటి శుభవార్త వస్తుందని అంతా ఆసక్తిగా ఉన్నారు.

2026 ఏప్రిల్ 1 నుండి దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ప్రతిపాదిత ఆదాయపు పన్ను చట్టం 2025 అమలులోకి రానుంది. సంక్లిష్టతను తగ్గించడం కొత్త చట్టం లక్ష్యం. ‘విక్షిత్ భారత్ 2047’ రోడ్‌మ్యాప్‌లో భాగంగా పారదర్శకమైన, సమర్థవంతమైన పన్ను వ్యవస్థను సృష్టించాలనే ప్రభుత్వ దార్శనికతకు ఈ కొత్త చట్టం అనుగుణంగా ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

బడ్జెట్‌లో ఈ మార్పులు ఉండొచ్చు..!

ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ ఎంపికగా నిరంతరం ప్రోత్సహిస్తోంది. బడ్జెట్ 2026 దీనిని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం రూ.4 లక్షల వరకు ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కింద మినహాయింపు పొందింది. పన్ను వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి దీనిని రూ.5 లక్షలకు లేదా రూ.6 లక్షలకు పెంచవచ్చని పన్ను నిపుణులు నమ్మకంగా ఉన్నారు. గత సంవత్సరం రాయితీల ద్వారా రూ.12 లక్షల ఆదాయపు పన్ను రహితంగా చేసిన తర్వాత, ఇప్పుడు ఆ స్లాబ్‌ను రూ.15 లక్షల వరకు పెంచే అవకాశం ఉందనే ఊహాగానాలు ఉన్నాయి. మధ్యతరగతికి అధిక ఆదాయాన్ని నిర్ధారించడానికి, వినియోగాన్ని పెంచడానికి విస్తృత 5 శాతం, 10 శాతం స్లాబ్‌లను కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

HRA మార్పులు, మెట్రో సిటీ విస్తరణ ప్రతిపాదనలు

పన్ను చెల్లింపుదారులు ఉపశమనం ఆశించే మరో రంగం ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ హైజ్‌ రెంటల్‌ అలవెన్స్‌). ప్రస్తుత నిబంధనల ప్రకారం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై మాత్రమే HRA లెక్కింపుకు మెట్రో నగరాలుగా అర్హత పొందాయి. దీనివల్ల ఉద్యోగులు ప్రాథమిక జీతంలో 50 శాతం వరకు మినహాయింపును పొందవచ్చు. 2026 బడ్జెట్ ఈ జాబితాను బెంగళూరు, హైదరాబాద్, పూణేలను చేర్చడానికి విస్తరించవచ్చు, దీనివల్ల ఈ అధిక ఖర్చుతో కూడిన నగరాల్లో జీతం పొందే వారికి ప్రయోజనం చేకూరుతుంది. కొత్త పన్ను విధానంలో పరిమిత HRA ప్రయోజనాలను ప్రవేశపెట్టాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది, ప్రస్తుతం అలాంటి మినహాయింపులు అనుమతించబడవు. HRAను చేర్చడం వల్ల కొత్త వ్యవస్థ వైపు మార్పు వేగవంతం అవుతుందని నిపుణులు వాదిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి