కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 23 జూలై 2024న మోదీ 3.0 పదవీకాలానికి సంబంధించిన తొలి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇదిలా ఉంటే బడ్జెట్‌లో రైతులకు భారీ కానుక లభిస్తుందని ఓ వార్త అందుతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి బడ్జెట్ కేటాయింపులను కేంద్రం 30 శాతం పెంచి దాదాపు రూ.80,000 కోట్లకు పెంచవచ్చని ప్రభుత్వ వర్గాలు బిజినెస్ టుడే టీవీకి తెలిపినట్లు తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్‌లో, ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రతి రైతుకు వార్షిక సాయం రూ.6,000 అందిస్తోంది. ఈ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది. జూన్ చివరి వారంలో జరిగిన ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సమావేశాల సందర్భంగా, వ్యవసాయ ప్రతినిధులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రైతుకు రూ. 8,000 వరకు పెంచవచ్చని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: నేపియర్ గడ్డి అంటే ఏంటో తెలుసా? దీని సాగుతో లక్షల్లో ఆదాయం
విడతకు రూ.8000 ఇవ్వాలని డిమాండ్:
పూర్తి బడ్జెట్‌లో యువత, మహిళలు, గ్రామీణ ప్రాంతాలు, రైతులపై దృష్టి సారిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. బిజినెస్ టుడే నివేదిక ప్రకారం, కిసాన్ యూనియన్‌కు చెందిన బద్రి నారాయణ్ చౌదరి మాట్లాడుతూ, పిఎం కిసాన్ కింద కేటాయింపులను రూ.6,000 నుండి రూ.8,000కి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించాము. సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే బడ్జెట్‌లో రైతులకు పీఎం కిసాన్ స్కీమ్‌లో ఏడాదికి 8 వేల రూపాయలు చేయవచ్చని తెలుస్తోంది.
ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థలో ఆదాయం, వ్యయాల పెరుగుదల కారణంగా FY 25 కోసం అధిక ప్రత్యక్ష, పరోక్ష పన్నులను అంచనా వేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.21.99 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా రూ.16.31 లక్షల కోట్లు వసూలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Bike Ride: బైక్‌లో ఈ భాగం ఎందుకంత ముఖ్యం.. దీని పనితీరు, ఉపయోగం ఏంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి