ఆర్థికమంత్రికి నిరుద్యోగి విన్నపం.. చదువుతో పాటు ఉద్యోగం కోసం ట్రైనింగ్ ఇచ్చేలా చూడండి

|

Jan 20, 2023 | 9:00 AM

మరికొన్ని రోజుల్లో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ 2023 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్రానికి ఇదే చివరి..

ఆర్థికమంత్రికి నిరుద్యోగి విన్నపం.. చదువుతో పాటు ఉద్యోగం కోసం ట్రైనింగ్ ఇచ్చేలా చూడండి
Budget 2023
Follow us on

మరికొన్ని రోజుల్లో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ 2023 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్‌ కావడంతో ఏయే వర్గానికి ఎలాంటి బడ్జెట్‌ ఉంటుందనే దానికి దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక బడ్జెట్‌పై తమ అభిప్రాయాలను తెలియజేయాలంటూ కేంద్రం తెలుపడంతో చాలా మంది లేఖల రూపంలో అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

ఫైనాన్షియల్ మినిస్టర్ మేడమ్,

హాయ్, నా పేరు సంతోష్ కుమార్. నేను ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో నివసిస్తున్నాను. నేను గవర్నమెంట్ సైన్స్ కాలేజీ నుంచి ఈ సంవత్సరం BSc పాసయ్యను. నేను కాలేజీ నుంచి బయటకు వచ్చి దాదాపు 9 నెలలు అవుతోంది. ప్రస్తుతం ఉద్యోగం వెతుక్కుంటూ ఊరు ఊరు తిరుగుతున్నాను. ఈ మధ్య హైదరాబాద్ లో ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వెళుతున్నప్పుడు మొబైల్‌లో వార్తలు చదువాను. వాటిలో మీరు ఎఏ సంవత్సరం బడ్జెట్ చేయడానికి ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారని తెలిసింది. అందుకే నేను కూడా ఈ రోజు నా ఆలోచనలతో ఈ ఉత్తరాన్ని మీకు రాస్తున్నాను.

ఇవి కూడా చదవండి

మేడమ్, నాకు కుటుంబ సభ్యులను ఎదుర్కోవడం కష్టంగా ఉంది. బీఎస్సీ చేశాక ఉద్యోగం రావడం ఇంత కష్టమని నాకు తెలియదు. బీటెక్ లాంటి ఖరీదైన కోర్సు చదవడానికి మా దగ్గర ఫీజులు భరించే స్థాయి లేదు. మా నాన్న గారు ఓ ప్రైవేట్ కంపెనీలో స్టోర్ సూపర్‌వైజర్. అంత చిన్నఉద్యోగం చేసే ఆయనకు ఖరీదైన విద్య కోసం ఫీజులు కట్టే అవకాశం ఎక్కడుంటుంది?అందుకే నాకు ప్రభుత్వ కళాశాలలో జాయిన్ చేయించారు.

నేను బయట ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. కానీ పని దొరకడం లేదు. కనీసం ఏటా ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్‌ తీసుకునే ముందు కెరీర్‌ కౌన్సెలింగ్‌ చేయించుకుంటే కొంత ఊరట లభిస్తుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కడ దొరుకుతాయనేది మనం తెలుసుకోవలసిన కనీస విషయం కదా.. ఆవిషయం చదువుకు ముందే అన్ని వివరాలు తెలుసుకుంటే మంచిది కదా..

ప్రతి సంవత్సరం నా లాంటి వేలాది మంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగుల సంఖ్యను పెంచుతున్నారు. హైదరాబాద్.. అమరావతి అని కలలు కనవద్దు. మీకు ఎక్కడ ప్రయివేట్ ఉద్యోగం వచ్చినా ముందు జాయిన్ అయిపోవాలని నిన్న నాన్న కూడా చెప్తున్నారు. ఇక మా చెల్లి కూడా చదువు పూర్తి చేసుకుని ఉంది. ఆమెకు పెళ్లి చేయాలి. మేడమ్, ఈ రోజు కోసం పగలు, రాత్రి కష్టపడి బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. మేడమ్, ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని విన్నాను. కానీ మా కాలేజీకి ఇంకా అది రాలేదు. ఇప్పుడు మేము ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లినా శిక్షణ తీసుకున్నారా? అనుభవం ఉందా? అని అడుగుతారు. ఒకరికి పని దొరికేలా ఇంత ఫీజు వసూలు చేసినా కాలేజీలు ఉద్యోగానికి అవసరమైన శిక్షణ ఇవ్వలేదు. ఇక ఎక్కడ ఉద్యోగం దొరకాకపోతే అనుభవం ఎక్కడ నుంచి వస్తుంది?

గవర్నమెంట్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ వంటివి చేస్తే చాలా బాగుంటుంది. నాలాంటి వారికి ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలకు మంచి నిపుణులు లభిస్తారు. ఏదైనా చేయండి మేడమ్. ఇప్పుడు ఆర్మీలో కూడా పర్మినెంట్ ఉద్యోగం లేదు. నా బస్ స్టాప్ వచ్చేసింది. అందుకే నా ఉత్తరాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. నేను ఇంటర్వ్యూలో పాసయి ఉద్యోగం వస్తే తప్పకుండా మీకు మళ్ళీ ఉత్తరం రాస్తాను.

శుభాకాంక్షలతో..

మీ

సంతోష్ కుమార్

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి