
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. గత నెలలో అత్యంత ప్రజాదరణ పొందిన భారత్ కనెక్ట్ 26 ప్రత్యేక వార్షిక ప్లాన్ గడువు నేటితో ముగుస్తుందని ప్రకటించింది. నెట్‌వర్క్ అప్‌గ్రేడ్, 5G సేవల దిశగా వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ వార్షిక ప్లాన్ వినియోగదారులను ఎంతగానో ఆకర్షించింది.
అదనంగా ఉచిత జాతీయ రోమింగ్‌తో పాటు BiTV యాక్సెస్. దీని ద్వారా లైవ్ టీవీ ఛానెల్‌లు, OTT కంటెంట్‌ను ఫ్రీగా వీక్షించవచ్చు.
రూ. 2,626 ప్లాన్‌తో పాటు, బీఎస్ఎన్ఎల్ మరో శక్తివంతమైన వార్షిక ప్లాన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ధర: రూ. 2799 ప్లాన్‌లో రోజుకు 3GB డేటా వస్తుంది. వార్షిక రీఛార్జ్ కోరుకునే వారికి అధిక ఇంటర్నెట్ అవసరం ఉన్నవారికి ఇది సరైన ఎంపిక.
ఐపీఎల్ 2026, టీ20 వరల్డ్ కప్ సందడి మొదలవుతున్న వేళ, బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక యాడ్ ఆన్ ప్యాక్ ప్రకటించింది. JioHotstar, SonyLIV, ZEE5 సబ్‌స్క్రిప్షన్ల యాక్సెస్ లభిస్తుంది. ఇందులఓ భాగంగా 90 రోజుల పాటు లైవ్ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు లేటెస్ట్ వెబ్ సిరీస్‌లు, సినిమాలను చూడొచ్చు. దీనిని ఇప్పటికే ఉన్న ఏదైనా యాక్టివ్ ప్లాన్‌తో కలిపి వాడుకోవచ్చు. రూ.2626 ప్లాన్ పొందాలనుకునే వారు ఈ రోజు అర్ధరాత్రిలోపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రేపటి నుండి ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు.