BSNL Best Prepaid Plan: ప్రస్తుత కాలంలో చాలా మంది తన ఫోన్ నెంబర్‌ను మూడు నెలల ప్లాన్ లేదా ఒక నెల ప్లాన్‌తో రీచార్జ్ చేస్తున్నారు. ఇలాంటి ప్లాన్‌లతో గడువు ముగియగానే ప్రతి నెలా లేదా ప్రతి మూడు నెలలకు రీచార్జ్ చేయాల్సి వస్తుంది. ఇలా ప్రతిసారీ రిచార్జ్ చేయాలంటే ఎవరికైనా విసుగే కదా.. అలాంటి వారికి ఉపశమనం కలిగించేందుకే కొత్త ఆఫర్‌ని తీసుకొచ్చింది బిఎస్ఎన్ఎల్. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం కంటే ఎక్కువ రోజులు నిశ్చింతగా ఉండేలా చేసే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను బిఎస్ఎన్ఎల్ తన యూజర్లకు అఫర్ చేస్తోంది. BSNL అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్‌తో పూర్తిగా 395 రోజులు డేటా, అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటుగా మరిన్ని ప్రయోజనాలను యూజర్లు పొందుతారు. ఈ ప్లాన్ ధర రూ.2399 కాగా, దీనితో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం..
బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం తీసుకొచ్చన రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ 395 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మీకు లభిస్తుంది. అలాగే ఈరోజుకు 2GB హై స్పీడ్ డేటాని అందుకుంటారు, ఇంకా ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత 40Kbps స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటాని వినియోగించుకోవచ్చు. అంతేకాదు ఈ ప్లాన్ రీఛార్జ్‌తో డైలీ 100 SMS లను కూడా ఉపయోగించుకోవచ్చు, అదీకూడా పూర్తి వ్యాలిడిటీ కాలం. ఇక ఈ ప్లాన్‌తో జతగా లభించే ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో 30 రోజుల ఉచిత PRBT, 30 రోజుల EROS Now ఉచిత యాక్సెస్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా ఈ ప్లాన్ తీసుకువస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..