BPL New Products: సరికొత్తగా రీఎంట్రీ ఇచ్చిన బీపీఎల్‌.. మార్కెట్లోకి పలు స్మార్ట్ ఉత్పత్తులు.

BPL New Products: బీపీఎల్‌ ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఈ కంపెనీ అగ్ర స్థానంలో ఉండేది. ఇప్పుడైతే రకరకాల కంపెనీల పేర్లు వినిపిస్తున్నాయి కానీ. ఒకప్పుడు మాత్రం...

BPL New Products: సరికొత్తగా రీఎంట్రీ ఇచ్చిన బీపీఎల్‌.. మార్కెట్లోకి పలు స్మార్ట్ ఉత్పత్తులు.

Updated on: Aug 31, 2021 | 7:54 AM

BPL New Products: బీపీఎల్‌ ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఈ కంపెనీ అగ్ర స్థానంలో ఉండేది. ఇప్పుడైతే రకరకాల కంపెనీల పేర్లు వినిపిస్తున్నాయి కానీ. ఒకప్పుడు మాత్రం బీపీఎల్‌ అగ్ర స్థానంలో ఉండేది. అయితే భారీగా పెరిగిన పోటీ కారణంగా బీపీఎల్‌ తన ప్రాభావ్యాన్ని కోల్పోతూ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా బీపీఎల్‌ మళ్లీ మార్కెట్‌ను హస్తగతం చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఈ బ్రాండ్‌ నుంచి పలు స్మార్ట్‌ ప్రోడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మారిన కాలానికి అనుగుణంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను సరికొత్త హంగులతో విడుదల చేసింది బీపీఎల్‌. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ప్రముఖ ఎలక్ట్రానిక్‌, రిటైల్‌ దుకాణాల్లో ఈ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

బీపీఎల్‌ తీసుకొచ్చిన కొత్త ఉత్పత్తులలో ఫైటెక్‌ ఫిల్ట్రేషన్‌తో ఏసీలు, యాంటీ బాక్టీరియల్‌ యాంటీ డస్ట్‌ డెకొరేటివ్‌ ఫ్యాన్‌లు మొదటి వరుసలో ఉన్నాయి. ఇక రిఫ్రిజిరేటర్లను నేచర్‌ ఫ్రెష్‌ టెక్నాలజీతో రూపొందించారు. అంతేకాకుండా బీపీఎల్‌ నుంచి 4కే ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ టీవీలు కూడా విడుదలయ్యాయి. తక్కువ నీటిని, విద్యుత్‌ను ఉపయోగించుకునే వాషింగ్‌ మిషన్‌లను సైతం బీపీఎల్‌ మార్కెట్లోకి విడుదల చేసింది.

అంతేకాకుండా ఆడియో గ్యాడ్జెట్స్‌తో పాటు కిచెన్‌, గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణ కోసం ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ ఇలా అన్ని రకాల కొత్త ప్రోడక్ట్స్‌ను తీసుకొచ్చింది. మరి ఈ కొత్త నిర్ణయంంతో బీపీఎల్‌ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందో లేదో చూడాలి.

Also Read: Tirumala: గజరాజులకు కోపం వచ్చింది.. భయంతో పరుగులు తీసిన భక్తులు.. తిరుమల మాఢవీధుల్లో ఏనుగుల ఘీంకారానికి కారణం ఏంటి ?

Karthikeya 2 movie: హీరోయిన్‏ను డిఫరెంట్‏గా పరిచయం చేసిన నిఖిల్.. కార్తికేయ 2లో నటించేది ఈ ముద్దుగుమ్మనే..

Zomato: పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న నిర్ణయం తీసుకున్న జొమాటో.. ఇకపై ఆర్డర్‌ చేసేముందు ఆ ఆప్షన్‌.

Loading...
Unable to load recommendations.
Follow Us