SBI: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. రెండు రోజుల సమ్మె వాయిదా..

ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఈ నెల 25,26వ తేదీల్లో చేపట్టాల్సిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఎస్బీఐ ఉద్యోగులు తమ డిమాండ్లపై రెండు రోజుల పాటు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. కానీ యాజమాన్యంతో చర్చలు అనంతరం సమ్మెను వాయిదా వేసుకున్నారు.

SBI: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. రెండు రోజుల సమ్మె వాయిదా..
State bank of india

Updated on: May 23, 2026 | 2:47 PM

ఎస్బీఐ కస్టమర్లకు భారీ గుడ్ న్యూస్. ఈ నెల 25,26వ తేదీల్లో ఎస్బీఐ ఉద్యోగులకు సమ్మెకు వెళ్లాలని ఇంతకుముందు నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు చివరి నిమిషంలో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో 25,26వ తేదీల్లో ఎస్బీఐ బ్యాంకులు యధావిధిగా పనిచేయనున్నాయి. అన్ని శాఖలు ఎప్పటిలాగే పనిచేస్తాయని, వినియోగదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఎస్బీఐ తెలిపింది. ఉద్యోగులు సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. వేతన వ్యత్యాసాలు, పెన్షన్లు, సిబ్బంది కొరత, అవుట్ సోర్సింగ్ వంటి సమస్యలపై ఎస్బీఐ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఉద్యోగులు, యాజమాన్యం మధ్య చర్చలు అనంతరం సమ్మె వాయిదా పడింది. దీంతో వినియోగదారులు నగదు విత్ డ్రా, డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్, ఇతర సేవలు పొందవచ్చు.

ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపునిచ్చిన సమ్మెను వాయిదా వేస్తున్నట్ల ఎస్బీఐ ప్రకటన జారీ చేసింది. బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కగలదని తెలిపింది. వదంతులను పట్టించుకోవద్దని స్పష్టం చేసింది. అయితే మే 23,24వ తేదీల్లో బ్యాంకులకు సెలవు కాగా.. 25,26వ తేదీల్లో సమ్మె చేపడితే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడేవి.

వచ్చే వారం బ్యాంక్ సెలవులు

బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. బక్రీద్ సందర్భంగా మే 27న బ్యాంకులకు సెలవు కావడంతో ఆ రోజు క్లోజ్ చేసి ఉంటాయి. ఇక మే 31న ఆదివారం సాధారణ సెలవు కావడంతో బ్యాంకులు పనిచేయవు. దీంతో వచ్చే వారంలో రెండు రోజులు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. బ్యాంకింగ్ కస్టమర్లు ముందుగానే దీనిని గమనించి ప్లాన్ చేసుకోవాలి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలీడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో తొమ్మిది సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు వర్తిస్తాయి. అయితే పబ్లిక్ హాలీడేస్‌తో పాటు నాల్గో శనివారం, ఆదివారాల్లో బ్యాంకులు మూతపడతాయి. ఇక మే 26వ తేదీన త్రిపురలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ప్రముఖఖ విత కాజీ నజ్రుల్ ఇస్లాం జన్మదినం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులు ఉండవు.

Follow Us