Airtel Plans: కోట్లాది మంది వినియోగారులకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌.. ఈ ప్లాన్‌ ధరల పెంపు.. సునీల్ మిట్టల్ చెప్పిందే జరిగింది

|

Mar 12, 2024 | 9:45 PM

భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో తమ కంపెనీ టారిఫ్ ప్లాన్‌ల ధరలను పెంచబోతున్నట్లు సూచించిన విషయం నిజమైపోయింది. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ప్లాన్‌ల ధరలను పెంచాల్సిన అవసరం ఉందని, ఇప్పుడు ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచడం ప్రారంభించిందని ఆయన అన్నారు. భారతదేశపు అతిపెద్ద, ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ తన రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల..

Airtel Plans: కోట్లాది మంది వినియోగారులకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌.. ఈ ప్లాన్‌ ధరల పెంపు.. సునీల్ మిట్టల్ చెప్పిందే జరిగింది
Airtel
Follow us on

భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో తమ కంపెనీ టారిఫ్ ప్లాన్‌ల ధరలను పెంచబోతున్నట్లు సూచించిన విషయం నిజమైపోయింది. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ప్లాన్‌ల ధరలను పెంచాల్సిన అవసరం ఉందని, ఇప్పుడు ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచడం ప్రారంభించిందని ఆయన అన్నారు.

ఎయిర్‌టెల్ ప్లాన్‌ల ధరలు పెరిగాయి:

భారతదేశపు అతిపెద్ద, ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ తన రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. ఎయిర్‌టెల్ రూ.118, రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. ఈ రెండూ 4జీ ప్లాన్లే. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.118 ఉండగా, ఇప్పుడు రూ.129గా మారింది. అదే సమయంలో 289 రూపాయల 4G ప్రీపెయిడ్ ప్లాన్ ధర ఇప్పుడు 329 రూపాయలుగా మారింది. ఈ రెండు ప్లాన్‌ల కొత్త ధరలు కూడా. Airtel యాప్, వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయబడ్డాయి. ఎయిర్‌టెల్ ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో వినియోగదారులు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌టెల్ రూ.129 ప్లాన్:

ఎయిర్‌టెల్ రూ.129 ప్లాన్ 12GB ఇంటర్నెట్ డేటాతో వస్తుంది. వినియోగదారులు తమ ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటులో ఎప్పుడైనా ఈ డేటాను ఉపయోగించవచ్చు. ఈ 12 GB డేటా చెల్లుబాటు వినియోగదారుల ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ వలెనే ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఇతర ప్రయోజనాలను పొందలేరు. అయితే ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ.118. దీని ప్రకారం ఇంటర్నెట్ డేటా ధర ఒక్కో జీబీకి రూ.9.83 ఉండగా, ధర పెరిగిన తర్వాత ఒక్కో జీబీ డేటాకు రూ.10.75 అవుతుంది.

ఎయిర్‌టెల్ రూ.329 ప్లాన్:

గతంలో ఈ ప్లాన్ ధర రూ.289గా ఉండేది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 35 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఇందులో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, 4GB డేటా, 300 SMS సౌకర్యాన్ని పొందుతారు. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా ఎయిర్‌టెల్‌ థాంక్స్ సౌకర్యాన్ని పొందుతారు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఉచిత HelloTunes, Wynk Music పొందుతారు.

జియో, వోడాఫోన్‌ ఐడియా ప్రణాళిక ఏంటి?

ఒక కంపెనీ తన రీఛార్జ్ ప్లాన్ ధరను పెంచినప్పుడు, దానికి పోటీగా ఇతర కంపెనీలు కూడా తమ ప్లాన్‌ల ధరను పెంచడం భారతీయ టెలికాం పరిశ్రమ చరిత్రలో చాలాసార్లు చూశాము. అటువంటి పరిస్థితిలో ఎయిర్‌టెల్ తర్వాత, జియో, వొడాఫోన్-ఐడియా కూడా తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి