
పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని చెబుతుంటారు. పెళ్లికి జీవితంలో ఉన్న ప్రాధాన్యత అలాంటిది. అందుకే ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎవరి స్థోమతకు తగ్గట్లు వాళ్లు వివాహాన్ని గ్రాండ్‌గా చేసుకుంటారు. అయితే ఇటీవల పెళ్లి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో పెళ్లిలకు కూడా రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంతకీ పెళ్లికి రుణం ఎక్కడ తీసుకోవచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం..
* పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు మొదలు ప్రైవేట్ బ్యాంకుల వరకు పెళ్లిలకు ప్రత్యేకంగా రుణాలు అందిస్తున్నాయి. యాక్సిస్, బజాజ్, ఐసీఐసీఐ ఇలా ప్రముఖ బ్యాంకులన్నీ పర్సనల్ లోన్‌లో భాగంగా మ్యారేజ్ లోన్స్ సైతం అందిస్తున్నారు. ఇందులో భాగంగా 9 శాతం ప్రారంభ వడ్డీతో రుణాలు అందిస్తున్నారు.
* ఒకవేళ రుణం తీసుకోవడం ఇష్టం లేకపోతే మీ పీఎఫ్ ఖాతా నుంచి కూడా డబ్బులు పొందొచ్చు. మీరు ఉద్యోగంలో చేరి ఏడేళ్లు గడిస్తే మీ పీఎఫ్ మొత్తం నుంచి రూ. 50,000 వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి వడ్డీ చెల్లించకుండానే మీరు దాచుకున్న సొమ్మును ఉపయోగించుకోవచ్చు.
* ఒకవేళ మీరు ఎల్‌ఐసీ చెల్లిస్తుంటే కూడా పెళ్లికి రుణం తీసుకోవచ్చు. మీ పాలసీ విలువలో 80 నుంచి 90 శాతం వరకు రుణం రూపం రూపంలో తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది.
* ఇక తక్కువ వడ్డీతో రుణం పొందాలనుకునే వారికి అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఆప్షన్ గోల్డ్ లోన్. దీంతో క్షణాల్లో లోన్‌ను పొందొచ్చు. ఇందుకోసం సిబిల్ స్కోర్ లాంటివి ఏలాంటి అవసరం ఉండదు.
* మీకు రెగ్యులర్ ఇనకమ్ ఉండి సిబిల్ స్కోర్ బాగుంటే పర్సనల్ లోన్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. తక్కువ వడ్డీతోనే కొన్ని బ్యాంకులు రుణాన్ని అందిస్తున్నారు. 12 నెలల నుంచి 60 నెలల్లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..