సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ప్రతీ ఒక్కరూ భావిస్తారు. ఎవరి ఆదాయానికి అనుగుణంగా వారు తమ సంపాదనలో కొంత సేవింగ్స్ చేసుకుంటారు. ఇందుకోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పొదుపు చేసుకునే డబ్బుకు సెక్యూరిటీతో పాటు, మంచి రాబడి రావాలని ఆశిస్తుంటారు. ఇక పొదుపు అనగానే చాలా మంది తొలుత ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతార. అయితే ఎఫ్‌డీలతో పోల్చితే ఎక్కువ రాబడి వచ్చే కొన్ని స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసా.? కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్ అందిస్తున్న అలాంటి కొన్ని బెస్ట్ పథకాల గురించి ప్పుడు తెలుసుకుందాం..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో కనీసం రూ. 500తో అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు. ఈ ఖాతాను మీకు సమీపంలోని పోస్టాఫీస్‌లో లేదా బ్యాంకులతో తెరుచుకోవచ్చు. ఈ అకౌంట్‌లో ప్రతీ ఏటా కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. 2023 జనవరి 1వ తేదీ నుంచి 7.1 శాతం వడ్డీని చెల్లిస్తుంది. ఈ అకౌంట్ కాల వ్యవధి 15 ఏళ్లు ఉంటుంది.
కిసాన్ వికాస్ పత్ర పథకం.. ఫిక్స్‌డ్ రేట్ స్మాల్ పొదుపు పథకం. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ప్రత్యేకంగా రైతుల కోసం రూపొందించారు. ప్రస్తుతం ఈ పథకంపై 7.5 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా కనీసం రూ. 1000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితిలేదు.
బాలికల భవిష్యత్తును సురక్షితం చేస్తూ ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈసుకొచ్చింది. ఈ పథకంపై హామీ వడ్డీ, చక్రవడ్డీ ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై 8 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఈ పథకంలో భాగంగా కనీస పెట్టుబడి రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు.
ఎలాంటి రిస్క్ లేకుండా రాబడి పొందే పథకాల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం ఒకటి. ఈ పథకంలో భాగంగా 7.7 శాతం వడ్డీ పొందొచ్చు. అంతకుముందు 7 శాతంగా ఉండగా ఇప్పుడు 7.7 శాతానికి పెంచారు. గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. ఇక ఈ పథకంలో పెట్టుబడి పెట్టే డిపాజిట్స్‌కు ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఉదాహరణకు మీరు ఇందులో రూ. 1000 పెట్టుబడి పెడితే, 5 ఏళ్లకు రూ. 1449 పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..