
కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే వారు ముందు మైలేజీ, సేఫ్టీ, అందులోని ఫీచర్లు, ధరపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. తక్కువ ధరకు మంచి మైలేజీ వచ్చే వాహనాలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. మీరు కూడా కొత్త కారును కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే.. మీకోసం అద్దిరిపోయే న్యూస్ ఇది. తక్కువ ధరకే మంచి మైలేజీని ఇచ్చే కార్ల లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ లిస్ట్ లోని కార్లు సరసమైన ధరకు లభించడం మాత్రమే కాదు.. సుమారు 36 kmpl వరకు మైలేజీని ఇస్తాయి. మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, టయోటా గ్లాంజా వంటి కార్లు ఉన్నాయి. తక్కువ ధరకే, ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తక్కువ ధరలకు మంచి మైలేజీని ఇచ్చే ఈ కార్ల జాబితాలో పెట్రోల్, సిఎన్‌జి కార్లు ఉన్నాయి. మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, టయోటా గ్లాంజా CNG వెర్షన్ 31km/kg మైలేజీని అందిస్తుంది. మారుతి స్విఫ్ట్ ధర రూ. 5.99-8.96 లక్షల (ఎక్స్-షోరూమ్), మారుతి బాలెనో ధర రూ. 6.45-9.66 లక్షల(ఎక్స్-షోరూమ్), టయోటా గ్లాంజా ఎక్స్-షోరూమ్ ధర రూ.6.59-9.99 లక్షలుగా ఉంది.
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన మారుతి ఆల్టో 800 మైలేజీ పరంగా కూడా గొప్పగా ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3.53 లక్షల నుండి రూ.5.12 లక్షల వరకు ఉంది. పెట్రోల్‌తో పాటు, ఈ కారు CNG ఆప్షన్ కూడా ఉంది. మారుతి ఆల్టో 800 CNG వెర్షన్ 32km/kg మైలేజీని అందిస్తుంది.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో దేశంలోని అత్యంత ఇంధన సామర్థ్యం గల కార్లలో ఒకటి. పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లతో వస్తున్న ఈ కారు కిలోకి 33 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారును రూ.4.25-6.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు.
భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం గల కార్ల జాబితాలో మారుతి వ్యాగన్ఆర్ కూడా అగ్రస్థానంలో ఉంది. వ్యాగన్ఆర్ CNG వెర్షన్ 34km/kg మైలేజీని అందిస్తుంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటైన మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.52-7.39 లక్షలు. ఈ కారు పెట్రోల్, CNG వేరియంట్లలో కూడా వస్తుంది.
భారతదేశపు అత్యంత మైలేజ్ సమర్థవంతమైన కార్లలో మారుతి సెలెరియో కూడా ఒకటి. ఈ విలాసవంతమైన హ్యాచ్‌బ్యాక్ కారు కిలో సీఎన్‌జి కి 36 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.33-7.12 లక్షలు.
గమనిక: కారు మైలేజ్ మరియు ధర గురించిన సమాచారం డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్ నుండి తీసుకోబడింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..