Business Idea: ఈ చికెన్ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు ధనవంతులు అవుతారు.. కోడిగుడ్డు ధర తెలిస్తే..

కడక్‌నాథ్ ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో కనిపించే కోడి జాతి. కానీ ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని పౌల్ట్రీ ఫామ్‌లతో సంబంధం ఉన్నవారు కడక్‌నాథ్‌ను అనుసరిస్తున్నారు. దీంతో వ్యాపారం చేస్తూ పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు.

Business Idea: ఈ చికెన్ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే మీరు ధనవంతులు అవుతారు.. కోడిగుడ్డు ధర తెలిస్తే..
Kadaknath Egg

Updated on: Jul 11, 2023 | 8:46 AM

భారతదేశంలో పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. ప్రారంభించడానికి కోట్ల రూపాయలు అవసరం లేని వ్యాపారం ఇది. పౌల్ట్రీ ఫాం వ్యాపారం కేవలం కొన్ని లక్షల రూపాయలలో ప్రారంభించవచ్చు. విశేషమేంటంటే పౌల్ట్రీ ఫారమ్ వ్యాపారాన్ని గ్రామం, పల్లెలు, నగరం, మెట్రో అని తేడా లేకుండా ఎక్కడైనా ప్రారంభించవచ్చు. ఎందుకంటే చికెన్‌కు ప్రతిచోటా డిమాండ్ ఉంది. వింటర్ సీజన్‌లో గుడ్లకు డిమాండ్ ఉన్న చోట ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రజల ఎంపిక చికెన్ అవుతుంది. కానీ డబ్బున్న వారు దేశీ కోడి మాంసం తినేందుకు ఇష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పౌల్ట్రీ ఫామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు కడక్‌నాథ్ కోడిని పెంచడం ప్రారంభిస్తే.. వారు మరింత సంపాదించవచ్చు.

కడక్‌నాథ్ చికెన్ చాలా ఖరీదైనది. ఒక్క గుడ్డు ఖరీదు రూ. 50లకు పైగా పలుకుతోంది. దీని మాంసం కిలో రూ.1000కు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో కడక్‌నాథ్ చికెన్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కడక్‌నాథ్ కోడిని పెంచడం ద్వారా సాధారణ కోడి కంటే చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా కడక్‌నాథ్ చికెన్‌ను పెంచుతున్నాడు. అతనికి రాంచీలో కడక్‌నాథ్ కోడి చాలా పెద్ద పౌల్ట్రీ ఫారం ఉంది.

కడక్‌నాథ్ మధ్యప్రదేశ్‌లో కనిపించే కోడి జాతి..

కడక్‌నాథ్ ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో కనిపించే కోడి జాతి. కానీ ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని పౌల్ట్రీ ఫామ్‌లతో సంబంధం ఉన్నవారు కడక్‌నాథ్‌ను అనుసరిస్తున్నారు. కడక్‌నాథ్ చికెన్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దాని రెక్కలు, ముక్కు, పాదాలు, మాంసానికి రక్తం నల్లగా ఉంటాయి. విశేషమేంటంటే దీని గుడ్లు కూడా నలుపు రంగులో ఉంటుందని అనుకుంటారు.. కానీ అలా కాదు దీని గుడ్లు మన లోకల్ కోడి గుడ్డు రంగులో ఉంటాయి. ఇందులో సాధారణ దేశీ చికెన్ కంటే చాలా రెట్లు ఎక్కువ ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయి. అందుకే దాని డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

దేశీ చికెన్‌తో పోలిస్తే కడక్‌నాథ్‌లో 25% కంటే ఎక్కువ ప్రొటీన్లు

మీరు కడక్‌నాథ్ కోడి పెంపకం కోసం పౌల్ట్రీ ఫారమ్‌ను తెరవాలనుకుంటే, మీకు కనీసం 150 చదరపు అడుగుల స్థలం అవసరం. ఒక షెడ్ చేయడం ద్వారా, మీరు ఈ స్థలంలో దాదాపు 100 కడక్‌నాథ్ కోడిపిల్లలను చూసుకోవచ్చు. ఈ కోడిపిల్లలు 5 నెలల్లో పూర్తిగా అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కడక్‌నాథ్ కోడి మాంసం కిలో 800 నుంచి 1000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఒక్క గుడ్డు ఖరీదు 50 రూపాయల కంటే ఎక్కువ. కడక్‌నాథ్ చికెన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా, మీరు 5 నెలల తర్వాత వేల రూపాయలు సంపాదించవచ్చు. దేశీ చికెన్‌తో పోలిస్తే కడక్‌నాథ్‌లో 25% కంటే ఎక్కువ ప్రొటీన్లు ఉన్నాయి.

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం