సమ్మర్ వచ్చేసింది, ఎండలు దంచికొడుతున్నాయి. వచ్చే రెండు నెలలు ఎండలు చుక్కలు చూపించడం ఖాయం. మరి ఈ సమ్మర్ సీజన్‌ను సరిగ్గా క్యాష్ చేసుకుంటే భారీగా ఆదాయం పొందొచ్చు. సమ్మర్‌లో మాత్రమే కాకుండా ఇతర సీజన్‌లోనూ ఈ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. అయితే మరీ ముఖ్యంగా సమ్మర్‌లో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు సాగుతుంది. ఇంతకీ ఏంటా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఆదాయం వస్తుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించడంలో ఐస్ క్యూబ్స్ తయారీ బిజినెస్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. నిజానికి సీజన్‌తో సంబంధం లేకుండా ఐస్ క్యూబ్స్ అమ్మకాలు జరుగుతాయి. అయితే ఇప్పటికే మీ చుట్టు పక్కాల ఉన్న ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటిలో పెద్ద పెద్ద ఐస్ ముక్కలను తయారు చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ చిన్న చిన్న ఐస్ క్యబ్స్‌కు ఉండే డిమాండ్ వేరేలా ఉంటుంది. వీటిని ముఖ్యంగా జ్యూస్ స్టాల్స్, బార్లు, వైన్స్‌లు, ఆసుపత్రుల్లో ఎక్కువగా అమ్ముతుంటారు.
అంతేకాకుండా మీరు తయారు చేసే ఐస్ క్యూబ్స్‌ను మినరల్ వాటర్‌తో తయారు చేసి మంచి ప్యాక్ చేసి విక్రయిస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఐస్ క్యూబ్ మేకింగ్ మిషన్ అవసర పడుతుంది. ఐస్ క్యూబ్ షేప్ ఆధారంగా ఈ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికొస్తే ఐస్ క్యూబ్స్ ప్రొడక్షన్ సంఖ్య ఆధారంగా మిషన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. సింగిల్ ఫేజ్ కరెంట్‌తో ఈ ఐస్ క్యూబ్ మిషన్ పనిచేస్తుంది కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అనంతరం ఐస్ క్యూబ్స్‌ను ప్యాక్ చేయడానికి కవర్స్, ఒక మిషన్ ఉంటే సరిపోతుంది.
ఐస్ క్యూబ్ మిషన్ సాధారణంగా రూ. లక్షలో అందుబాటులో ఉంటుంది. లాభాలా విషయానికొస్తే మార్కెట్లో ఒక కిలో ఐస్ క్యూబ్స్ రూ. 15 వరకు ఉన్నాయి. అయితే కిలో ఐస్ క్యూబ్స్ తయారీకి రూ. 5 ఖర్చువుతుంది. దీంతో ఒక్క ప్యాకెట్‌పై సుమారు రూ. 10 లాభం పొందొచ్చు. సుమారు రోజుకు 100 ప్యాకెట్లు సేల్ చేసినా రోజుకు వెయ్యి రూపాయలు ఏటు పోవు. ఈ లెక్కన నెలకు రూ. 30 వేలు సంపాదించొచ్చు. మీ సొంత బ్రాండింగ్‌తో పబ్లిసిటీ చేసుకుంటే మరింత లాభాలు పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..