Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచి సూపర్‌ఫాస్ట్ రైలు ప్రారంభం.. ఆ తర్వాత వందే భారత్ స్లీపర్!

Indian Railways: ప్రస్తుతం ప్రారంభించనున్న సూపర్‌ఫాస్ట్ రైలును భవిష్యత్తులో వందే భారత్ స్లీపర్ సర్వీస్‌గా మార్చాలన్న తన అభ్యర్థనకు రైల్వే మంత్రి అంగీకరించారని జోషి తెలిపారు. ఈ సెమీ హై-స్పీడ్ రైలు సుదూర ప్రయాణాల్లో ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలను అందించడమే..

Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచి సూపర్‌ఫాస్ట్ రైలు ప్రారంభం.. ఆ తర్వాత వందే భారత్ స్లీపర్!
Indian Railways

Updated on: May 09, 2026 | 9:20 AM

Indian Railways: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బెంగళూరు – ముంబై నగరాల మధ్య నూతన సూపర్‌ఫాస్ట్ రైలు సర్వీస్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. గత ఏడాది ఈ రెండు నగరాల మధ్య రెండవ ప్రత్యక్ష సూపర్‌ఫాస్ట్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ‘ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్’ తర్వాత ఈ మార్గంలో మంజూరైన రెండో రైలు ఇదే కావడం విశేషం.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, వచ్చే నెలలో ఈ రైలు పట్టాలెక్కనుందని తెలిపారు. ఈ రైలు తుమకూరు, దావణగెరె, హవేరి, హుబ్బల్లి-ధార్వాడ్, బెలగావి మీదుగా ప్రయాణిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

మధ్య కర్ణాటక మీదుగా ముంబై వాణిజ్య నగరానికి వెళ్లేందుకు వీలుగా, జూన్ చివరి నాటికి బెంగళూరు-ముంబై సూపర్‌ఫాస్ట్ రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ నూతన సర్వీస్ ద్వారా ఈ మార్గంలో ప్రయాణించే లక్షలాది మందికి లబ్ధి చేకూరడమే కాకుండా, వాణిజ్యం, వ్యాపార రంగాలకు మరింత ఊతం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

త్వరలో బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్

ప్రస్తుతం ప్రారంభించనున్న సూపర్‌ఫాస్ట్ రైలును భవిష్యత్తులో వందే భారత్ స్లీపర్ సర్వీస్‌గా మార్చాలన్న తన అభ్యర్థనకు రైల్వే మంత్రి అంగీకరించారని జోషి తెలిపారు. ఈ సెమీ హై-స్పీడ్ రైలు సుదూర ప్రయాణాల్లో ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలను అందించడమే కాకుండా, రాత్రి ప్రయాణ అనుభవాన్ని సరికొత్తగా మార్చనుంది.

చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సాంకేతికతతో బెంగళూరులోని BEML అభివృద్ధి చేసిన ఈ సరికొత్త ఆరెంజ్, గ్రే రంగు రైలు, కెఎస్‌ఆర్ బెంగళూరు- ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) మధ్య నడవనుంది. దేశంలోనే ఇది రెండో వందే భారత్ స్లీపర్ రైలు కానుంది.

ఇది కూడా చదవండి: Ambani vs Musk: స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ.. స్టార్‌లింక్‌కు ముఖేష్‌ అంబానీ చెక్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us