Bank Holidays in This Week: ఈ వారంలో బ్యాంకుకు వెళ్లాల్సిన పనులున్నాయా.. అయితే ఈ రోజే చేసుకునేవిధంగా ప్లాన్ చేసుకోండి.. ఎందుకంటే

|

Sep 07, 2021 | 9:00 AM

Bank Holidays in This Week: బ్యాంక్ వినియోగదారులకు ఎలెర్ట్... ఈ వారంలో మీకు బ్యాంక్ లావాదేవీలున్నాయా.. ఖచ్చితంగా ఈ వారంలో ఆ బ్యాంకు పనులు పూర్తికావాల్సి ఉంటే ఈరోజే బ్యాంక్ కు వెళ్ళడానికి..

Bank Holidays in This Week: ఈ వారంలో బ్యాంకుకు వెళ్లాల్సిన పనులున్నాయా.. అయితే ఈ రోజే చేసుకునేవిధంగా ప్లాన్ చేసుకోండి.. ఎందుకంటే
Bank Holidays
Follow us on

Bank Holidays in This Week: బ్యాంక్ వినియోగదారులకు ఎలెర్ట్… ఈ వారంలో మీకు బ్యాంక్ లావాదేవీలున్నాయా.. ఖచ్చితంగా ఈ వారంలో ఆ బ్యాంకు పనులు పూర్తికావాల్సి ఉంటే ఈరోజే బ్యాంక్ కు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే బ్యాంక్ పనులు మరోవారం రోజులపాటు వాయిదా పడే ప్రాబ్లెమ్ వస్తుంది అనుకునేవారు.. ఈ రోజు బ్యాంక్ కు వెళ్ళండి.. ఎందుకంటే బుధవారం నుంచి ఆదివారం వరకూ వరసగా బ్యాంకులకు సెలవులు. ఈరోజు ఒక్కరోజే ఈ వారంలో మిగిలి ఉంది. కనుక గుర్తు పెట్టుకుని మరీ ఈరోజు బ్యాంక్ కు బయలుదేరండి.. పని ఉంటె పూర్తి చేసుకోండి.

రేపు బుధవారం (సెప్టెంబ‌ర్ 8న) శ్రీమంత శంక‌ర‌దేవ తిథి
గురువారం అంటే( సెప్టెంబ‌ర్ 9న) తీజ్ పండుగ
శుక్రవారం ( సెప్టెంబ‌ర్ 10న) వినాయ‌క చ‌వితి కనుక
సెప్టెంబ‌ర్ 11న రెండో శనివారం
సెప్టెంబ‌ర్ 12న ఆదివారం

అంటే సెప్టెంబ‌ర్ 8 నుంచి 12 వ‌ర‌కు వరసగా బ్యాంకులకు సెలవులు.. కనుక ఏమైనా బ్యాంక్ పనులుంటే.. రెగ్యులర్ గా ఎన్నిపనులున్నా పక్కకు పెట్టి.. ఈరోజు బయలుదేరండి..

అయితే ఈ బ్యాంక్ సెలవును అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండవు.. బ్యాంక్ సెలవులు రాష్ట్రాల వారీగా మారతాయి. పైన పేర్కొన్న పండుగ‌లు అన్నీ జ‌రుపుకునే రాష్ట్రాల్లో ఐదు రోజులు సెల‌వులు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో పై పండుగ‌లు అన్నీ ముఖ్య‌మైన‌వి కావు. కనుక ఆ రాష్ట్రాల్లో ఏ పండుగని జరుపుకోరో.. ఆ రోజు ఆ రాష్ట్రంలో బ్యాంకులు ప‌నిచేస్తాయి.మిగతా తేదీలలో రాష్ట్రాల వారీగా సెలవులు ఉంటాయి. అయితే, ఈ సెలవు సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలకు ఎటువంటి అంతరాయం ఉండదు.

Also Read: AP BJP: రాజకీయ కుట్రలు, కుతంత్రాలు చేయడంలో లెఫ్ట్ పార్టీ నేతలు సిద్ధహస్తులంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు..