Bank Employees Strike: డిసెంబర్16,17 తేదీల్లో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. ఎందుకంటే..

|

Dec 02, 2021 | 8:50 AM

దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. డిసెంబర్ 16,17 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలిపింది...

Bank Employees Strike: డిసెంబర్16,17 తేదీల్లో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. ఎందుకంటే..
Bank
Follow us on

దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. డిసెంబర్ 16,17 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలిపింది. మొత్తంగా తొమ్మిది యూనియన్లతో కూడిన ఉండే ఈ ఫోరం డిసెంబర్ 16 నుంచి రెండు రోజుల స్ట్రైక్​ చేయాలని నిర్ణయించింది. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ సమ్మె చేస్తున్నట్లు పేర్కొంది. 1 ఫిబ్రవరి 2021న సమర్పించిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు బ్యాంకుల ప్రైవేటీకరిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని యూఎఫ్‌బీయూ నిర్ణయించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్​ వెంకటాచలం తెలిపారు. ఈ మేరకు డిసెంబర్​ 16, 17 తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్లు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసేలా ఉందని ఆయన అన్నారు.

కొద్ది రోజులు బ్యాంక్‎ల విలీనాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బీకనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, భారతీయ మహిళ బ్యాంకు విలీనమయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‎లో ఒరియంటల్ బ్యాంక్, యూనైనెట్ బ్యాంక్ విలీనమయ్యాయి. కెనరా బ్యాంక్, సిండికెట్ బ్యాంకు కలిసి పోయాయి. ఇండియాన్ బ్యాంక్‎లో అలహబాద్ బ్యాంక్ విలీనమైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనమైంది. బ్యాంక్ ఆఫ్ బారోడాలో దేనా, విజయ బ్యాంక్ విలీనమయ్యాయి.

Read Also.. HDFC Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఎంత పెరిగాయంటే..