Telugu News Business Bank offers on car loan these banks are offering7 9 rate of interest on car loan
Bank Car Loan: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? ఈ బ్యాంకుల్లో చౌకైన కారు లోన్!
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వివిధ రకాల రుణాలను అందజేస్తున్నాయి. కార్లపై కూడా రుణాలు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ ఉంటే మరి కొన్ని..
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వివిధ రకాల రుణాలను అందజేస్తున్నాయి. కార్లపై కూడా రుణాలు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ ఉంటే మరి కొన్ని బ్యాంకులు కాస్త ఎక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నాయి. దీంతో చాలా మంది కారు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. సాధారణ ప్రజలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ఆటో పరిశ్రమ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడంతో ఈ ఏడాది బ్యాంకులు ఖాతాదారులను తమ వైపు తిప్పుకునేలా అనేక పథకాలను అందిస్తున్నాయి. కార్‌లోన్‌పై వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్నాయి.
ఈ పథకాల కింద కస్టమర్లు 7.9% నుండి 8.45% వరకు వడ్డీ రేట్లు పొందుతున్నారు. మీరు కూడా రాబోయే కొద్ది రోజుల్లో కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే అతి తక్కువ వడ్డీ రేటుతో కారు లోన్‌ను అందించే బ్యాంకుల గురించి తెలుసుకోండి.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు కేవలం 8.05% వడ్డీ రేటుతో కారు రుణాలను అందిస్తోంది. ఈ వడ్డీ రేటు రూ. 15,611 ఈఎంఐపై అందిస్తోంది.
ఇక దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన కస్టమర్లకు 7.9% వడ్డీ రేటును అందిస్తోంది. 10 లక్షల రుణంపై ఈ వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది.
అదే సమయంలో ఐసిఐసిఐ బ్యాంక్ తన కార్ లోన్‌పై రూ. 10 లక్షల వరకు 8.25% వడ్డీ రేటును పొందుతోంది. ఈ వడ్డీ రేటు రూ. 15,711 ప్రారంభ ఈఎంఐపై అందుబాటులో ఉంటుంది.
మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 8.3, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.35% వడ్డీ రేటుతో కార్ లోన్‌లను అందిస్తోంది. ఈ వడ్డీ రేటు రూ. 15,761 ఈఎంఐపై అందుబాటులో ఉంది.