ప్రతి నెల రాగానే బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది బ్యాంకు పనుల నిమిత్తం ప్రతి రోజు వెళ్తుంటారు. అలాంటప్పుడు నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోడం ముఖ్యమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఇప్పుడు నవంబర్ నెల ప్రారంభమైంది. ఈ నెలలో సగం రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. మరి ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం.
ఈ నవంబర్ నెలలో బ్యాంకులు మొత్తం 14 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా ప్రాంతాలను బట్టి ఈ సెలవుల్లో మార్పులు ఉంటాయని గుర్తించుకోండి. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పండగలు, రాష్ట్ర పండగల రోజుల్లో అక్కడ సెలవు ఇస్తుంటారు. అలాగే ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు సాధారణ సెలవులు ఉంటాయి. ఇదిలా ఉండగా, బ్యాంకులకు సెలవులు రోజుల్లో కూడా మొబైల్ బ్యాంకింగ్, ఇతర ఆన్‌లైన్ చెల్లింపులు యధావిధిగా పని చేస్తాయి. డిజిటల్ చెల్లింపులకు ఎలాంటి ఆటంకం ఉండదు.
ఇది కూడా చదవండి: LPG Cylinder: దీపావళి పండగ వేళ సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు..
- నవంబర్ 1: దీపావళి, అమావాస్య సందర్భంగా త్రిపుర, కర్ణాటక, ఉత్తారఖండ్, మాహారాష్ట్ర, సిక్కిం, మేఘాలయా, జమ్మూకశ్మీర్, మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 2: దీపావళి పండగను పురస్కరించుకుని మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, సిక్కిం, రాజస్థాన్, యూపీలో బ్యాంకులు మూసి ఉంటాయి.
- నవంబర్ 3: ఆదివారం బ్యాంకులకు దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.
- నవంబర్ 7: ఛట్ పూజ సందర్భంగా అసోం, ఛత్తీస్‌గడ్, బీహార్, ఝార్ఖండ్‌లో బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 8: వంగల పండగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 9: రెండవ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు.
- నవంబర్ 10: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 12: ఎగాస్ బగ్వాల్ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు బంద్.
- నవంబర్ 15: గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ, ఒడిశా, చండీగఢ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, ఢిల్లీ, గుజరాత్, జమ్మూకశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 17: ఆదివారం దేశవ్యాప్తంగా సాధారణంగా బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 18: కనకదాస జయంతిని పురస్కరించుకుని కర్ణాటకలో బ్యాంకులు బంద్.
- నవంబర్ 22: లబాబ్ డుచెన్ సందర్భంగా సిక్కింలో సెలవు.
- నవంబర్ 23: నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.
- నవంబర్ 24: ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
ఇది కూడా చదవండి: TRAI: నవంబర్ 1 నుంచి కాదు.. జనవరి 1 నుంచి.. గడువు పొడిగించిన ట్రాయ్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి