Bank Holiday May 2026: మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్‌..!

Bank Holiday May 2026: మీరు బ్యాంక్ ద్వారా డ్రాఫ్ట్‌లు తీయాలన్నా లేదా ముఖ్యమైన డాక్యుమెంట్లు సమర్పించాలన్నా, పై తేదీలను దృష్టిలో ఉంచుకుని ముందే మీ పనులను ప్లాన్ చేసుకోండి. దీనివల్ల చివరి నిమిషంలో కంగారు పడకుండా ఉండవచ్చు. అలాగే బ్యాంకులు..

Bank Holiday May 2026: మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్‌..!
Bank Holiday May 2026

Updated on: Apr 25, 2026 | 11:15 AM

Bank Holiday May 2026: మే నెల మొదలవ్వబోతోంది.. ఎండలు మండుతున్న వేళ బ్యాంకు పనుల కోసం బయటకు వెళ్లే ముందు సెలవుల జాబితాను ఒకసారి చూసుకోవడం చాలా అవసరం. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2026 నెలకు సంబంధించి బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ నెలలో ఆదివారాలు, శనివారాలతో పాటు వివిధ పండుగల కారణంగా మొత్తం 12 రోజులు బ్యాంకులు పనిచేయవు.

మే 2026లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా:

  • మే 1 (శుక్రవారం): బుద్ధ పూర్ణిమ / మే డే (మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సెలవు).
  • మే 3 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.
  • మే 9 (శనివారం): రెండో శనివారం, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (దేశవ్యాప్తంగా సెలవు).
  • మే 10 (ఆదివారం): దేశవ్యాప్తంగా సెలవు.
  • మే 16 (శనివారం): కొన్ని రాష్ట్రాల్లో ‘రాష్ట్ర దినోత్సవం’ సందర్భంగా సెలవు.
  • మే 17 (ఆదివారం): దేశవ్యాప్తంగా సెలవు.
  • మే 23 (శనివారం): నాలుగో శనివారం (దేశవ్యాప్తంగా సెలవు).
  • మే 24 (ఆదివారం): దేశవ్యాప్తంగా సెలవు.
  • మే 26 (మంగళవారం): కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు).
  • మే 27 (బుధవారం): బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) – దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో సెలవు.
  • మే 28 (గురువారం): బక్రీద్ సందర్భంగా మరికొన్ని రాష్ట్రాల్లో అదనపు సెలవు.
  • మే 31 (ఆదివారం): దేశవ్యాప్తంగా సెలవు.
  • మే నెలలో ‘లాంగ్ వీకెండ్’

ఇది కూడా చదవండి: వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట.. సర్వేలో షాకింగ్‌ నిజాలు..!

నెల ప్రారంభంలోనే మే 1 (శుక్రవారం) సెలవు రావడంతో ఆ తర్వాత శని, ఆదివారాలు కలిపి ప్రయాణాలు చేసే వారికి ఇది మంచి వీకెండ్‌గా ఉపయోగపడుతుంది. అయితే మే 2వ తేదీన బ్యాంకులు పనిచేస్తాయని గమనించగలరు.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్ సర్వీసులు యథాతథం:

బ్యాంకులు భౌతికంగా మూసివేసినప్పటికీ, కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి. UPI లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యథావిధిగా పనిచేస్తాయి. ATM సేవలు నగదు విత్‌డ్రా కోసం అందుబాటులో ఉంటాయి. కేవలం చెక్ క్లియరెన్స్, పాస్‌బుక్ అప్‌డేట్ వంటి బ్రాంచ్ పనులు మాత్రమే సెలవు రోజుల్లో జరగవు.

స్టాక్ మార్కెట్ సెలవులు:

ఈ నెలలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) కూడా రెండు రోజులు పనిచేయవు:

మే 1: మహారాష్ట్ర దినోత్సవం.

మే 28: బక్రీద్.

మీరు బ్యాంక్ ద్వారా డ్రాఫ్ట్‌లు తీయాలన్నా లేదా ముఖ్యమైన డాక్యుమెంట్లు సమర్పించాలన్నా, పై తేదీలను దృష్టిలో ఉంచుకుని ముందే మీ పనులను ప్లాన్ చేసుకోండి. దీనివల్ల చివరి నిమిషంలో కంగారు పడకుండా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: Online Gaming Rules: ఆన్‌లైన్ గేమింగ్‌కు కొత్త నిబంధనలు.. మే 1 నుంచి అమలు..!

ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us