
2026 ఏప్రిల్ నెలలో పండుగలు, వార్షిక ముగింపు, వారాంతపు సెలవుల కారణంగా అనేక రోజులు బ్యాంకులు పనిచేయవు. ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో చూద్దాం.. ఈ రోజు రామనవమి. ఈ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇప్పుడు నెల ముగింపుకు వస్తున్న తరుణంలో, వచ్చే నెల అంటే ఏప్రిల్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో మీకు తెలుసా? ఏప్రిల్ 2026లో పలు సెలవుల కారణంగా భారతదేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం నెల మొదటి రోజు, అంటే ఏప్రిల్ 1న బ్యాంకులు మూసి ఉంటాయి. దీనిని ఆర్థిక ఖాతాల వార్షిక ముగింపు రోజుగా పాటిస్తారు. ఇది తప్పనిసరి సెలవుదినం కాబట్టి, దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు మూసి ఉంటాయి.
ఇది కూడా చదవండి: నిమ్మకాయలు నెల రోజుల పాటు తాజాగా ఉండాలా? ఈ చిట్కాలు పాటించండి!
ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ మొదలైందిరా బాబోయ్.. బంగారం, వెండి ధరలు పరుగులే.. పరుగులు!
బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి. UPI (GPay, PhonePe) ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ యథావిధిగా పనిచేస్తాయి. నగదు ఉపసంహరణ కోసం ATM సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. బ్యాంకుకు వెళ్లే పని ఉంటే, పైన పేర్కొన్న సెలవులను దృష్టిలో ఉంచుకుని మీ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోండి.
ఇది కూడా చదవండి: LPG Gas: సంచలన నిర్ణయం.. వీరికి నిలిచిపోనున్న గ్యాస్ బుకింగ్ సేవలు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి