
జూలై నెల ముగియబోతోంది. తర్వాత ఆగస్టు నెల ప్రారంభం కానుంది. ప్రతి నెలలాగే, ఆగస్టు 2024 ప్రారంభంతో చాలా పెద్ద ఆర్థిక మార్పులు కనిపించబోతున్నాయి. అయితే రక్షాబంధన్, జన్మాష్టమి వంటి పెద్ద పండుగల కారణంగా, బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. అటువంటి పరిస్థితిలో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, వీలైనంత త్వరగా పరిష్కరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Condom: Gold Price: షాకింగ్ న్యూస్.. మళ్లీ బంగారం ధర భారీగా పెరిగే అవకాశం.. ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఆగస్టు నెలలో చాలా సందర్భాలలో బ్యాంకుల్లో పని చేయవు. బ్యాంక్ సంబంధిత పని కోసం ఇంటి నుండి బయలుదేరే ముందు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంక్ సెలవుల జాబితాను చూడటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వచ్చే నెలలో ఏకంగా బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు సివేయబడనుండగా, రక్షా బంధన్, జన్మాష్టమి సందర్భంగా కూడా బ్యాంకులు మూసి ఉంటాయి. ఆగస్టులో వచ్చే 13 బ్యాంకు సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు అలాగే వారపు సెలవులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి.
ఇది కూడా చదవండి: Condom: కండోమ్స్ అతని జీవితాన్నే మార్చేసింది.. దురదృష్టాన్ని నెట్టేసి అదృష్టాన్ని తట్టి లేపింది!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి