అగస్టు నెల మొదలైంది. ఆర్ధిక ప్లాన్ చేసుకోవాలి.. బ్యాంకు లావాదేవీలు చాలా ముఖ్యం. కొన్ని సార్లు మనకు తెలియకుండా బ్యాంకు పనులను వాయిదా వేసుకుంటాం. మనం వెళ్లిన రోజు బ్యాంకు క్లోజ్ ఉంటుంది. సరిగ్గా రోజు బ్యాంకుకు సెలవు. అంతే షాక్.. మనం ముందుగా తెలిస్తే బ్యాంకు పని నిన్ననే పూర్తి చేసుకునేవారిమని పశ్చాత్తాప పడుతాం. ఎందుకంటే చాలా మంది పరీక్షల ఫీజులు, కానీ కంపెనీలకు చెల్లించాల్సిన డీడీల విషయంలో రేపు కట్టొచ్చులే అని పక్కన పెడుతాం. అప్పుడే ఇలాంటి ఘటనలు జరుుతుంటాయి. ముందే బ్యాంకు సెలవుల వివరాలు తెలుసుకుని ఉంటే ఆ సమస్య అస్సలు రాదు.
ప్రతి నెలలాగే, ఈ నెల కూడా సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. కొత్త క్యాలెండర్ ప్రకారం, ఆగస్టు నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉండబోతున్నాయి. ఈ అన్ని ఆదివారాలు అలాగే రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులు క్లోజ్ ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ సెలవులను మూడు కేటగిరీలుగా ఉంచింది. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో ఈ సెలవులు రానున్నాయి.
శని, ఆదివారాలు కాకుండా, ఆగస్టు నెలలో కొన్ని ఎనిమిది బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. వీటిలో టెండాంగ్ లో రమ్ ఫాట్, స్వాతంత్ర్య దినోత్సవం, పార్సీ నూతన సంవత్సరం (షహన్‌షాహి), శ్రీమంత శంకరదేవ తేదీ, మొదటి ఓనం, తిరువోణం, రక్షా బంధన్, రక్షా బంధన్/శ్రీ నారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్ ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా ఈ సెలవులు ఉంటాయి.
బ్యాంకుల పనిదినాలను వారానికి ఐదు రోజులు మాత్రమే ఉంచాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) డిమాండ్ చేసింది. దీనితో పాటు, ఉద్యోగులకు వారానికి 2 రోజులు సెలవులు లభిస్తాయి. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల్లో సెలవులు లభిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం